ఇంగ్లండ్‌కు బిగ్‌ షాక్‌ | Buttler out of Pakistan tour and doubt for Australia after hamstring injury | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌కు బిగ్‌ షాక్‌

Sep 29 2026 8:36 AM | Updated on Sep 29 2026 8:36 AM

Buttler out of Pakistan tour and doubt for Australia after hamstring injury

source: X

వచ్చే నెల పాకిస్తాన్‌లో జరుగనున్న వన్డే ట్రై సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. హ్యామ్‌స్ట్రింగ్‌ గాయం కారణంగా ఇన్‌ ఫామ్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ ఈ టోర్నీకి దూరమయ్యాడు. అతడి స్థానంలో జోర్డాన్‌ కాక్స్‌ జట్టులోకి వచ్చాడు. శ్రీలంకతో తాజాగా జరిగిన రెండో వన్డేలో బ్యాటింగ్‌ చేస్తుండగా బట్లర్‌ హ్యామ్‌స్ట్రింగ్‌ గాయానికి గురయ్యాడు.

బట్లర్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన కాక్స్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అతడు మూడు అర్ధ సెంచరీలతో రాణించాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలోనూ బట్లర్‌ స్థానంలో బరిలోకి దిగి 76 పరుగులు చేశాడు.

కాగా, అక్టోబర్‌ 20 నుంచి పాకిస్తాన్‌-శ్రీలంక-ఇంగ్లండ్‌ మధ్య ముక్కోణపు వన్డే టోర్నీ ప్రారంభం కానుంది. ఆ తర్వాత నవంబర్‌లో ఇంగ్లండ్‌ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. బట్లర్‌ ఆసీస్‌ పర్యటనకు కూడా అందుబాటులో ఉండే అవ​కాశాలు తక్కువగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే, స్వదేశంలో తాజాగా శ్రీలంకతో ముగిసిన పరిమిత ఓవర్ల సిరీస్‌లలో ఇంగ్లండ్‌ అద్భుత విజయాలు సాధించింది. తొలుత జరిగిన టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసిన ఆతిథ్య జట్టు.. ఆతర్వాత జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లలో జోస్‌ బట్లర్‌ అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. టీ20ల్లో 2, వన్డేల్లో ఓ అర్ద సెంచరీ చేశాడు. 

ఇదీ చదవండి: ఒకే రోజు 6 సెంచరీలు.. వన్డే క్రికెట్ చరిత్రలోనే సరికొత్త ప్రపంచ రికార్డు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement