Asian Games Cricket: మరో చిన్న జట్టుకు అన్యాయం | Asian Games 2026: Sri lanka, Nepal match wiped out with out toss, sri lanka advances into semis | Sakshi
Sakshi News home page

Asian Games Cricket: మరో చిన్న జట్టుకు అన్యాయం

Sep 29 2026 8:10 AM | Updated on Sep 29 2026 8:13 AM

Asian Games 2026: Sri lanka, Nepal match wiped out with out toss, sri lanka advances into semis

ఏషియన్‌ గేమ్స్‌ 2026 పురుషుల క్రికెట్‌లో వరుణుడు చిన్న జట్ల అవకాశాలను భారీ దెబ్బతీస్తున్నాడు. ఇప్పటికే తొలి రెండు క్వార్టర్‌ ఫైనళ్లు వర్షం కారణంగా పూర్తిగా తుడిచి పెట్టుకుపోగా.. చిన్న జట్లు (ఆఫ్ఘనిస్తాన్‌, హాంగ్‌కాంగ్‌ చైనా) కనీసం పోటీ కూడా చేయకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. మెరుగైన ర్యాంకింగ్‌ ఆధారంగా అప్పటికే నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన భారత్‌, పాక్‌ సెమీస్‌కు చేరుకున్నాయి.

తాజాగా మరో చిన్న జట్టు నేపాల్‌కు కూడా అన్యాయం జరిగింది. గ్రూప్‌ దశలో తమ కంటే పటిష్టమైన ఆఫ్ఘనిస్తాన్‌కు షాకిచ్చి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన ఈ జట్టు.. వర్షం కారణంగా కనీసం బరిలోకి దిగకుండానే టోర్నీ నుంచి నిష్క్ర​మించింది. శ్రీలంకతో ఇవాళ జరగాల్సిన మూడో క్వార్టర్‌ ఫైనల్‌ వర్షం​ కారణంగా కనీసం టాస్‌ కూడా పడకుండానే రద్దైంది. దీంతో భారత్‌, పాక్‌లాగే శ్రీలంక కూడా సెమీస్‌కు అర్హత సాధించింది.

భారత్‌ వర్సెస్‌ శ్రీలంక
అక్టోబర్‌ 1న జరుగబోయే రెండో సెమీస్‌లో శ్రీలంక భారత్‌ను ఢీకొంటుంది. ఇవాళే మరో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కూడా జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు బంగ్లాదేశ్‌-మలేషియా తలపడాల్సి ఉంది. 

ఈ మ్యాచ్‌ విజేత అక్టోబర్‌ 1నే జరిగే తొలి సెమీస్‌లో పాక్‌తో తలపడుతుంది. వాస్తవానికి ఈ మ్యాచ్‌ కూడా జరిగే అవకాశాలు కనిపించడం​ లేదు. తొలి మూడు క్వార్టర్‌ ఫైనల్స్‌ మాదిరిగానే ఈ మ్యాచ్‌ కూడా వర్షం​ కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది.

ఇదే జరిగితే నాలుగు చిన్న జట్లు క్వార్టర్‌ ఫైనల్స్‌లో కనీసం బరిలోకి దిగకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించినట్లవుతుంది. 

ఇదీ చదవండి: ఆసీస్‌తో తొలి టెస్టు.. భార‌త ఓపెన‌ర్ డ‌బుల్ సెంచ‌రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement