ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియాకప్‌లో పాకిస్తాన్ యువ జట్టు బోణీ కొట్టింది. ఈ టోర్నీలో భాగంగా అల్ అమీరత్ వేదికగా శుక్రవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. పాక్ బౌలర్ల ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 224 పరుగులు చేసి ఆలౌటైంది.
యూఏఈ బ్యాటర్లలో నూరుల్లా అయోబీ(70) టాప్ స్కోరర్‌గా నిలవగా.. యయిన్ రాయ్(47) కాస్త ఫర్వాలేదన్పించాడు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ సయ్యమ్ మూడు వికెట్లు పడగొట్టగా అలీ రజా, హస్నైన్ అబ్బాస్ దార్, రిజ్వానుల్లా తలా రెండు వికెట్లు చొప్పున సాధించారు.
ఉస్మాన్ ఖాన్ భారీ సెంచరీ
అనంతరం 226 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 37.3 ఓవర్లలో ఊదిపడేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖాన్(120 బంతుల్లో 21 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 139) భారీ సెంచరీతో కదం తొక్కగా.. జహంగీర్ బిలాల్(60) హాఫ్ సెంచరీతో రాణించాడు. పాక్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆదివారం భారత్ అండర్-19 టీమ్‌తో తలపడనుంది. మరో వైపు భారత జట్టు కూడా తమ తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై గెలిచి శుభారంభం చేసింది.
చదవండి: Babar azam: అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు బ్రో.. రిటైర్ అయిపోవచ్చు కదా!


