ఆస్ట్రేలియా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. కొత్త ముఖాలకు చోటు | Australia Announce-ODI-T20I squads For Home Series Against England | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. కొత్త ముఖాలకు చోటు

Nov 2 2026 11:12 AM | Updated on Nov 2 2026 11:31 AM

Australia Announce-ODI-T20I squads For Home Series Against England

Photo Credit: Twitter

స్వ‌దేశంలో ఇంగ్లండ్‌తో వ‌న్డే, టీ20 సిరీస్ నేప‌థ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా సోమ‌వారం 14 మందితో రెండు వేర్వేరు జ‌ట్ల‌ను ప్ర‌క‌టించింది. న్యూజిలాండ్‌తో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ నేప‌థ్యంలో జ‌ట్టు సీనియ‌ర్లు రెగ్యుల‌ర్ కెప్టెన్ పాట్ క‌మిన్స్‌తో పాటు మిచెల్ స్టార్క్‌, హాజిల్‌వుడ్‌ల‌కు విశ్రాంతి క‌ల్పించింది. దీంతో మిచెల్ మార్ష్ ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. 

న‌వంబ‌ర్ 13 నుంచి డిసెంబ‌ర్ 2 మ‌ధ్య ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మూడు వ‌న్డేల‌తో పాటు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడ‌నున్నాయి. కాగా జ‌ట్టులో ఎక్కువ‌గా కొత్త ముఖాల‌కు చోటు క‌ల్పించారు. మ‌హ్లీ బియ‌ర్డ్‌మ‌న్‌, జాక్ ఎడ‌వ‌ర్డ్స్‌, ఓలీ పీక్‌, నిఖిల్ చౌద‌రీ, జోయెల్ డేవిస్‌, ల‌చ్లాన్ షా వంటి యంగ్ క్రికెట‌ర్ల‌కు జ‌ట్టుకు ఎంపిక చేశారు. 

ట్రెవిస్ హెడ్‌, మాట్ రెన్ షా, జోష్‌ ఇంగ్లిస్‌, కూప‌ర్ క‌నోలి, కామెరాన్ గ్రీన్‌ల‌కు టీ20ల నుంచి విశ్రాంతి క‌ల్పించారు. గాయం నుంచి కోలుకొని నాథ‌న్ ఎల్లిస్‌ను వ‌న్డేలకు ఎంపిక చేయ‌లేదు. అయితే టీ20ల‌కు మాత్రం అత‌డిని ఎంపిక చేశారు. గ్లేవియ‌ర్ బార్ట్‌లెట్‌, మ‌హ్లీ బియ‌ర్డ్‌మ‌న్‌, జాక్ ఎడ్‌వ‌ర్డ్స్‌, ఆడ‌మ్ జంపా, స్పెన్స‌ర్ జాన్స‌న్‌లు వ‌న్డే, టీ20 జ‌ట్ల‌కు ఎంపికయ్యారు. 

టిమ్ డేవిడ్‌, నిఖిల్‌చౌద‌రీ, జోయెల్ డేవిస్‌, జేక్ ఫ్రేజ‌ర్ మెక్‌గుర్క్‌, సామ్ హార్ప‌ర్‌, మిచెల్ ఓవెన్‌లు టీ20 జ‌ట్టుకు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోగా; లియామ్ స్కాట్‌, ట్రావిస్ హెడ్‌, గ్రీన్‌, అలెక్స్ కేరీ, కూప‌ర్ క‌నోలీల‌ను వ‌న్డేల‌కు ఎంపిక చేశారు.

వ‌న్డే సిరీస్ షెడ్యూల్‌:
👉తొలి వ‌న్డే- న‌వంబ‌ర్ 13, పెర్త్ 
👉రెండో వ‌న్డే- న‌వంబ‌ర్ 15, అడిలైడ్‌
👉మూడో వ‌న్డే- న‌వంబ‌ర్ 18, హోబ‌ర్ట్‌

టీ20 సిరీస్ షెడ్యూల్‌:
👉తొలి టీ20- న‌వంబ‌ర్ 21, మెల్‌బోర్న్‌
👉రెండో టీ20- న‌వంబ‌ర్ 24, గోల్డ్‌కోస్ట్‌
👉మూడో టీ20- న‌వంబ‌ర్ 27, బ్రిస్బేన్‌
👉నాలుగో టీ20- న‌వంబ‌ర్ 29, సిడ్నీ
👉ఐదో టీ20- డిసెంబ‌ర్ 2, కాన్‌బెర్రా

ఆస్ట్రేలియా (వన్డే జట్టు): మిచెల్ మార్ష్(కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, మహ్లీ బీర్డ్‌మన్, అలెక్స్ క్యారీ, కూపర్ కనోలి, జాక్ ఎడ్వర్డ్స్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, ఓలీ పీక్, మాథ్యూ రెన్‌షా, లియామ్ స్కాట్, ఆడమ్ జంపా.

ఆస్ట్రేలియా (టీ20 జట్టు): మిచెల్ మార్ష్(కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, మహ్లీ బీర్డ్‌మన్, నిఖిల్ చౌదరి, టిమ్ డేవిడ్, జోయెల్ డేవిస్, జాక్ ఎడ్వర్డ్స్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, సామ్ హార్పర్, స్పెన్సర్ జాన్సన్, మిచెల్ ఓవెన్, లాచ్లాన్ షా, ఆడమ్ జంపా.

ఇదీ చదవండి: ఐదేసిన ముకేశ్‌.. సిరాజ్‌కు నాలుగు వికెట్లు; కివీస్ 424 ఆలౌట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement