ప్ర‌పంచ రికార్డుకు అడుగుదూరంలో అర్ష‌దీప్‌ | Arshdeep-Equals Tim Southee-Record-Most T20I Wickets-Powerplay | Sakshi
Sakshi News home page

ప్ర‌పంచ రికార్డుకు అడుగుదూరంలో అర్ష‌దీప్‌

Nov 2 2026 9:22 AM | Updated on Nov 2 2026 9:58 AM

Arshdeep-Equals Tim Southee-Record-Most T20I Wickets-Powerplay

Photo Credit: BCCI Twitter

టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్ అర్ష‌దీప్ సింగ్ అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో మ‌రో అరుదైన ఫీట్ సాధించాడు. టీ20ఐల్లో తొలి ప‌వ‌ర్ ప్లేలో (0-6 ఓవ‌ర్లు) అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన బౌల‌ర్ల జాబితాలో అర్ష‌దీప్ చోటు సంపాదించాడు. ఇప్ప‌టివ‌ర‌కు అర్ష‌దీప్ తొలి ప‌వ‌ర్ ప్లేలో 65 వికెట్లు తీశాడు. 

తద్వారా న్యూజిలాండ్ మాజీ బౌల‌ర్ టిమ్ సౌథీ (65 వికెట్లు)తో క‌లిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. అర్ష‌దీప్‌ మ‌రో వికెట్ సాధిస్తే, తొలి ప‌వ‌ర్ ప్లేలో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా అర్ష‌దీప్ ప్ర‌పంచ రికార్డు సాధించ‌నున్నాడు. డిసెంబ‌ర్‌లో లంక‌తో టీ20 సిరీస్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అర్ష‌దీప్ ఈ ఫీట్‌ను ఆ సిరీస్‌లో అందుకునే అవ‌కాశ‌ముంది.

టీ20ఐల్లో 0-6 ఓవ‌ర్ల‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్లు:
👉అర్ష‌దీప్ సింగ్ (టీమిండియా)- 65 వికెట్లు 
👉టిమ్ సౌథీ (న్యూజిలాండ్‌)- 65 వికెట్లు
👉బ్లెసింగ్ ముజ‌ర‌బానీ (జింబాబ్వే)- 62 వికెట్లు
👉రిచ‌ర్డ్ న‌ర‌వా (జింబాబ్వే)- 62 వికెట్లు
👉షాహిన్ అఫ్రిది (పాకిస్తాన్‌)- 60 వికెట్లు

👉ఇక అర్ష‌దీప్.. న్యూజిలాండ్‌తో నాలుగో టీ20 సంద‌ర్భంగా టీ20ల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్న విష‌యం తెలిసిందే. టీమిండియా త‌ర‌ఫున అంత‌ర్జాతీయ టీ20ల్లో 150 వికెట్ల మార్క్ అందుకున్న తొలి బౌల‌ర్‌గా అర్ష‌దీప్‌ రికార్డుల‌కెక్కాడు.

న్యూజిలాండ్‌తో జ‌రిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భార‌త్ 3-2తో కైవ‌సం చేసుకుంది. ఆదివారం జ‌రిగిన చివ‌రి టీ20లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో భార‌త్‌పై విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 191 ప‌రుగులు చేసింది. ఇషాన్ కిష‌న్ (61), శ్రేయ‌స్ అయ్య‌ర్ (50) అర్థ‌సెంచ‌రీలు చేయ‌గా, న‌మ‌న్ ధీర్ (33) మెరిశాడు. 

అనంత‌రం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 18 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 195 ప‌రుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెన‌ర్ టిమ్ సీఫెర్ట్ (93) సెంచ‌రీ చేజార్చుకోగా, గ్లెన్ ఫిలిప్స్ (65 నాటౌట్‌) జ‌ట్టును గెలిపించాడు. ఇరుజ‌ట్ల మ‌ధ్య తొలి వ‌న్డే బుధ‌వారం ఆక్లాండ్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.

ఇదీ చదవండి: ‘వీళ్లిద్దరూ ఉన్నంతకాలం అతడికి అవకాశమివ్వరు!’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement