breaking news
T20Is
-
చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. విదేశీ వేదికపై 20 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా అవతరించింది. షార్జాలోని షార్జా క్రికెట్ స్టేడియంలో 29 మ్యాచ్‌లు ఆడిన ఆఫ్ఘన్ జట్టు 20 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. యూఏఈ ట్రై సిరీస్‌లో భాగంగా నిన్న యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో గెలుపొందడంతో ఆఫ్ఘనిస్తాన్ ఖాతాలో ఈ రికార్డు చేరింది.ఓవరాల్‌గా ఓ వేదికపై అత్యధిక విజయాలు సాధించిన రికార్డు బంగ్లాదేశ్ పేరిట ఉంది. బంగ్లాదేశ్ ఢాకాలోని షేర్ ఏ బంగ్లా స్టేడియంలో 48 మ్యాచ్‌ల్లో 24 విజయాలు సాధించింది. బంగ్లాదేశ్ తర్వాత స్వదేశంలో అత్యధిక టీ20 విజయాలు సాధించిన రికార్డు పాకిస్తాన్ పేరిట ఉంది. పాక్ లాహోర్‌లోని గడాఫీ స్టేయడింలో 26 మ్యాచ్‌ల్లో 16 విజయాలు సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ తర్వాత విదేశీ వేదికగా అత్యధిక విజయాలు సాధించిన రికార్డు కూడా పాకిస్తాన్ పేరిటే ఉంది. పాక్ దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 32 మ్యాచ్‌ల్లో 18 విజయాలు సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే.. యూఏఈపై ఆఫ్ఘనిస్తాన్ 4 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. ఓపెనర్లు గుర్బాజ్ (40), ఇబ్రహీం జద్రాన్ (48) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కరీం జనత్ (28), గుల్బదిన్ నైబ్ (20 నాటౌట్), అజ్మతుల్లా (14 నాటౌట్) ఆఖర్లో వేగంగా పరుగులు సాధించారు. యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ 2 వికెట్లు తీయగా.. సిమ్రన్‌జీత్ సింగ్, ముహమ్మద్ ఫరూక్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 171 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ.. చివరి బంతి వరకు గెలుపు కోసం పోరాడింది. చివరి ఓవర్లో గెలుపుకు 17 పరుగులు అవసరం కాగా.. యూఏఈ తొలి మూడు బంతులకే 12 పరుగులు చేసి గెలుపు ఖాయమనుకుంది. అయితే ఆఫ్ఘన్ బౌలర్ ఫరీద్ అహ్మద్ మాలిక్ అనూహ్యంగా పుంజుకుని చివరి 3 బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దీంతో యూఏఈకి ఓటమి తప్పలేదు.యూఏఈ ఇన్నింగ్స్‌కు కెప్టెన్ ముహమ్మద్ వసీం (44), అలీషాన్ షరాఫు (27) శుభారంభాన్ని అందించారు. ఆఖర్లో ఆసిఫ్ ఖాన్ (40) మెరుపు ఇన్నింగ్స్ ఆడినా చివరి రెండు బంతులను వృధా చేసి ఆఫ్ఘన్ ఓటమికి బాధ్యుడయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫరీద్ మాలిక్, ముజీబ్, షరాఫుద్దీన్, నూర్ అహ్మద్, అహ్మద్జాయ్ తలో వికెట్ తీశారు.కాగా, ఈ టోర్నీ ఫైనల్ రేపు జరుగనుంది. టైటిల్ కోసం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తలడపడతాయి. ఈ టోర్నీ ముగియగానే ఇరు జట్లు ఆసియా కప్‌లో పాల్గొంటాయి. -
రోహిత్ శర్మ సంచలన నిర్ణయం?
-
టీ20 మ్యాచ్‌లో 517 పరుగులు.. దెబ్బకు ప్రపంచ రికార్డు బద్దలు
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో పరుగుల వరద పారింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సూపర్‌స్పోర్ట్ పార్క్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి ఏకంగా 517 పరుగులు సాధించాయి. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 258 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 259 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించి దక్షిణాఫ్రికా ప్రపంచరికార్డు సృష్టించింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక టార్గెట్‌ను ఛేజ్ జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా (245/5) జట్టు పేరిట ఉంది. 2018లో న్యూజిలాండ్ జట్టుతో (20 ఓవర్లలో 243/6)తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఈ రికార్డు నమోదు చేసింది. కాగా ప్రోటీస్ ఇన్నింగ్స్‌లో క్వింటన్ డి కాక్ (44 బంతుల్లో 100; 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) దూకుడుగా ఆడి 43 బంతుల్లో శతకం బాదగా, హెన్డ్రిక్స్ (28 బంతుల్లో 68; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అండగా నిలిచాడు. ప్రపంచ రికార్డు సృష్టించిన విండీస్-దక్షిణాఫ్రికా మ్యాచ్ ఇక పరుగుల సునామీ సృష్టించిన విండీస్-దక్షిణాఫ్రికా రెండో టీ20 మ్యాచ్ మరో ప్రపంచ రికార్డును కూడా నమోదు చేసింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే రెండు ఇన్నింగ్స్‌లు కలిపి అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌గా ఈ రెండో టీ20 నిలిచింది. ఈ మ్యాచ్‌లో విండీస్-ప్రోటీస్ జట్లు కలిపి 517 పరుగులు సాధించాయి. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్ , ముల్తాన్ సుల్తాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ పేరిట ఉండేది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి 515 పరుగులు చేశాయి. తాజా మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన విండీస్,దక్షిణాఫ్రికా జట్లు ఈ ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాయి. చదవండి: SA vs WI: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా 🚨 RESULT | SOUTH AFRICA WIN BY 6 WICKETS Records were broken as Quinton de Kock's maiden T20I century set the #Proteas on their way to chasing down a mammoth 259-run target - with 7 balls remaining - to level the KFC T20I series#SAvWI #BePartOfIt pic.twitter.com/XMJnBL6p5r — Proteas Men (@ProteasMenCSA) March 26, 2023 That was special 🔥#SAvWI #BePartOfIt pic.twitter.com/rruu4aYa0h — Proteas Men (@ProteasMenCSA) March 26, 2023 -
తిసారా పెరీరాకు వన్డే పగ్గాలు
భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం శ్రీలంక కెప్టెన్‌గా సీనియర్ ఆల్‌రౌండర్ తిసారా పెరీరా నియమితుడయ్యాడు. ఉపుల్ తరంగ స్థానంలో పెరీరాను నియమిస్తున్నట్లు లంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. వన్డేలతోపాటుగా టి20 జట్టుకూ పెరీరాయే కెప్టెన్‌గా ఉంటాడని వెల్లడించింది. 2009 డిసెంబర్లో అరంగేట్రం చేసిన పెరీరా ఇప్పటి వరకు 125 వన్డేలు ఆడి 108.26 స్ట్రయిక్ రేట్‌తో 1,441 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో 32.62 సగటుతో 133 వికెట్లు తీశాడు. తరంగ నాయకత్వంలో శ్రీలంక జట్టు ఇటీవల భారత్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ జట్ల చేతుల్లో వన్డే సిరీస్‌లను కోల్పోయింది. -
టి-20, వన్డేలకు లంక క్రికెటర్ గుడ్ బై
కొలంబో: శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ రంగన హెరాత్ వన్డే, టి20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టెస్టులపై మరింత దృష్టిపెట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని గతవారమే లంక బోర్డు (ఎస్ఎల్సీ) దృష్టికి తీసుకొచ్చానని, దానికి ఆమోదం కూడా తెలిపిందన్నాడు. ‘రాబోయే ఎనిమిది నెలల్లో మేం 12 టెస్టులు ఆడాల్సి ఉంది. కాబట్టి పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే 2019 ప్రపంచకప్ వరకు యువ ఆటగాళ్లు కుదురుకోవడానికి మంచి సమయం లభిస్తుంది. అలాగే నాపై భారం కూడా తగ్గించుకుని కేవలం టెస్టులపైనే దృష్టి కేంద్రీకరించాలని భావిస్తున్నా’ అని హెరాత్ పేర్కొన్నాడు. ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితమైన హెరాత్... 2014 టి20 ప్రపంచకప్‌ను లంక గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. లంక తరఫున 71 వన్డేల్లో 74; 17 టి20ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఏ క్రికెటరైనా ఏదో సమయంలో ఆటను ఆపేయాల్సిందేనని ఎస్ఎల్సీ వ్యాఖ్యానించింది. హెరాత్ టెస్టు క్రికెట్ భవిష్యత్ బాగుండాలని ఆకాక్షించింది. మే, జూన్ నెలల్లో లంక... ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇందుకోసం నేటి నుంచి సన్నాహాలు మొదలుపెట్టనుంది.