సార్‌బ్రుకెన్ (జర్మనీ): హైలో ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్– 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ ‘డబుల్ ధమాకా’ సృష్టించింది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు... పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ప్రపంచ 8వ ర్యాంకర్ సింధు 21–12, 21–14తో ప్రపంచ 25వ ర్యాంకర్ లినె హోమార్క్ జార్స్‌ఫెల్ట్ (డెన్మార్క్)పై, ప్రపంచ 14వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–17, 21–10తో ప్రపంచ 6వ ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై నెగ్గారు. సింధు, లక్ష్య సేన్‌లకు 37,500 డాలర్ల (రూ. 35 లక్షల 59 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ, 9200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
ఈ ఏడాది సింధుకిది రెండో టైటిల్. గత జూలైలో సింధు జపాన్ ఓపెన్–750 టోర్నీలో విజేతగా నిలిచింది. మరోవైపు లక్ష్య సేన్‌కిది ఈ సీజన్‌లో తొలి టైటిల్. హైలో ఓపెన్‌లో లక్ష్య సేన్ చాంపియన్‌గా నిలువడం ఇది రెండోసారి. 2019లోనూ లక్ష్య సేన్ ఈ టోర్నీలో టైటిల్ సాధించాడు. 2024 తర్వాత ఒకే టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ టైటిల్స్‌ను భారత ప్లేయర్లు నెగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం. 2024 సయ్యద్ మోదీ ఓపెన్‌లో సింధు, లక్ష్య సేన్ సింగిల్స్ విభాగంలో విజేతలుగా నిలిచారు.


