హర్మన్‌ప్రీత్‌ హ్యాట్రిక్‌ | Indian team wins fourth consecutive match in Asian Champions Trophy mens hockey tournament | Sakshi
Sakshi News home page

హర్మన్‌ప్రీత్‌ హ్యాట్రిక్‌

Nov 2 2026 3:34 AM | Updated on Nov 2 2026 3:34 AM

Indian team wins fourth consecutive match in Asian Champions Trophy mens hockey tournament

భారత్‌కు నాలుగో విజయం  

జలంధర్‌: ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ పురుషుల హాకీ టోర్నీలో ఆతిథ్య భారత జట్టు వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. మలేసియా జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 4–2 గోల్స్‌ తేడాతో గెలిచింది. భారత్‌ తరఫున కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ మూడు గోల్స్‌తో (3వ, 33వ, 58వ నిమిషాల్లో) ‘హ్యాట్రిక్‌’ సాధించగా... సుఖ్‌జీత్‌ సింగ్‌ (43వ ని.లో) ఒక గోల్‌ చేశాడు. మలేసియా జట్టుకు అఖిముల్లా (25వ ని.లో), షెలో సిల్వెరియస్‌ (60వ ని.లో) ఒక్కో గోల్‌ అందించారు. 

తమకు లభించిన ఏడు పెనాల్టీ కార్నర్‌లలో మూడింటిని... ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను టీమిండియా గోల్స్‌గా మలిచింది. మలేసియా తమకు లభించిన మూడు పెనాల్టీ కార్నర్‌లను వృథా చేసుకుంది. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో భారత్‌ 12 పాయింట్లతో, మలేసియా 9 పాయింట్లతో ఇప్పటికే సెమీఫైనల్‌ చేరుకున్నాయి. నేడు జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో భారత్‌ ఆడుతుంది. ఆదివారం జరిగిన ఇతర లీగ్‌ మ్యాచ్‌ల్లో కొరియా 5–0తో బంగ్లాదేశ్‌ను ఓడించగా... చైనా, జపాన్‌ మ్యాచ్‌ 2–2తో ‘డ్రా’గా ముగిసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement