ఇండిగో ఉద్యోగిని అనుమానాస్పద మృతి | IndiGo Employee Death In Maharashtra | Sakshi
Sakshi News home page

ఇండిగో ఉద్యోగిని అనుమానాస్పద మృతి

Nov 16 2026 9:51 AM | Updated on Nov 16 2026 9:54 AM

IndiGo Employee Death In Maharashtra

గోండియా: మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉద్యోగిని అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం కలకలం రేపుతోంది. పుణె విమానాశ్రయంలో ఇండిగో టికెట్ కౌంటర్‌లో పనిచేస్తున్న వర్షా తుర్కర్ (35) మృతదేహం బోంద్రానీ అటవీ ప్రాంతంలో లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

దీపావళికి పుట్టింటికి..
మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా ఖైరీ గ్రామానికి చెందిన వర్షా ఉద్యోగరీత్యా పుణెలో నివసిస్తున్నారు. 2024లో ఆమెకు వివాహమైంది. ఆమెకు రెండున్నరేళ్ల కుమార్తె ఉంది. భర్త ఇండోర్‌లో ఉంటుండగా, దీపావళి పండుగ జరుపుకునేందుకు వర్ష తన కుమార్తెతో పాటు పుట్టింటికి వచ్చారు.

స్నేహితుడితో బయటకు వెళ్లి..
నవంబర్ 14న సాయంత్రం 4 గంటల సమయంలో పరిచయస్తుడైన నితేశ్ అగర్వాల్‌తో కలిసి వైనగంగ నది ఒడ్డుకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత నితేశ్.. వర్ష కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అనుకోని ఘటన జరిగిందని సమాచారం ఇచ్చాడు.

ఆసుపత్రికి తరలించినా..
కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకోగా, బోంద్రానీ అడవిలో వర్ష తీవ్ర గాయాలతో కనిపించారు. వెంటనే మధ్యప్రదేశ్‌లోని ఖైరలాంజీ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.

స్నేహితుని మాటలపై అనుమానాలు..
ముసుగులు ధరించిన కొందరు దుండగులు తమపై దాడిచేసి దోపిడీకి పాల్పడ్డారని, ఈ క్రమంలో వర్ష మరణించిందని నితేశ్ పోలీసులకు తెలిపాడు. అయితే అతడి శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడం పోలీసులకు అనుమానం కలిగించింది. అతని మాటల్లో పొంతనలేని అంశాలు ఉండటంతో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వర్ష మృతికి అసలు కారణమేంటి? ఈ ఘటన వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: Thailand: భారీ అగ్నిప్రమాదం.. 11 మంది మృతి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement