న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్(ఈసీ)కి, ఓట్ చోరీకి వ్యతిరేకంగా నవంబర్ ఒకటో తేదీన ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి పార్టీ చేపట్టే నిరసన ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మద్దతు ప్రకటించారు. అయితే, తమ మద్దతుదారులు ఆ ర్యాలీలో పాల్గొనబోరని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఆదివారం చేపట్టే నిరసన కార్యక్రమానికి వెళ్లడం లేదన్నారు. ఓటు చోరీకి వ్యతి రేకంగా ఎవరు నిరసనలు చేపట్టినా మద్దతు తెలుపుతూనే ఉంటామన్నారు. తమ సంస్థ స్వతంత్రంగా, తటస్థంగా ఉంటుందని, ఇదే వైఖరి కొనసాగిస్తామని తెలిపారు. ఆదివారం దీప్కే ఢిల్లీలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. అనంతరం దీప్కే, మమత మీడియాతో మాట్లాడారు.


