వెల్లింగ్ట‌న్‌లో టీమిండియా.. రెండో వన్డేకు ఒక మార్పుతో! | BCCI Shares Video-Team India Arrives-Wellington-2nd-ODI-Vs NZ | Sakshi
Sakshi News home page

వెల్లింగ్ట‌న్‌లో టీమిండియా.. రెండో వన్డేకు ఒక మార్పుతో!

Nov 5 2026 12:48 PM | Updated on Nov 5 2026 1:11 PM

BCCI Shares Video-Team India Arrives-Wellington-2nd-ODI-Vs NZ

Photo Credit: BCCI Twitter

న్యూజిలాండ్‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. వ‌ర్షం అంత‌రాయంతో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో 143 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ 22.4 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లి (74) అర్థ‌సెంచ‌రీతో రాణించాడు. ఇక శ‌నివారం ఇరుజ‌ట్ల మ‌ధ్య రెండో వ‌న్డే జ‌ర‌గ‌నుండ‌డంతో టీమిండియా గురువారం మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌ వెల్లింగ్ట‌న్‌లో అడుగుపెట్టింది. 

జట్టులో అదొక్కటే మార్పు..
ఈ నేప‌థ్యంలో బీసీసీఐ భార‌త క్రికెట‌ర్లు వెల్లింగ్ట‌న్‌లో ల్యాండ్ అయిన ఫొటోలు, వీడియోలు పంచుకుంది. ‘‘ఆక్లాండ్ ముగిసింది.. రెండో వ‌న్డే కోసం ఫోక‌స్ షిఫ్ట్ టూ వెల్లింగ్ట‌న్‌’’ అని క్యాప్ష‌న్ జ‌త చేసింది. వెల్లింగ్ట‌న్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న రెండో వ‌న్డేకోసం భార‌త తుదిజ‌ట్టులో పెద్ద‌గా మార్పులు లేక‌పోవ‌చ్చు. 

అకిబ్ న‌బీ ప్ర‌భావం చూపించ‌క‌పోవ‌డంతో సిరాజ్ జ‌ట్టులోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఇది మిన‌హా తొలి వ‌న్డే ఆడిన జ‌ట్టే రెండో వ‌న్డేలోనూ ఆడ‌నుంది. రుతురాజ్‌ గైక్వాడ్‌కు అవకాశమివ్వాలని క్రికెట్‌ అభిమానుల నుంచి విజ్ఞప్తులు వస్తు‍న్నప్పటికీ, రోడ్‌ టూ 2027 వరల్డ్‌కప్‌ నేపథ్యంలో టాప్‌-6లో ఎలాంటి మార్పులు చేయకూడదని బీసీసీఐ భావిస్తోంది.

ఇదీ చదవండి: రంజీల్లో చ‌రిత్ర సృష్టించిన త‌మిళ‌నాడు క్రికెట‌ర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement