రూ.7 కోట్ల న‌ష్టంతో సీఎస్‌కేలోకి విధ్వంస‌క‌ర ప్లేయ‌ర్‌ | CSK Trade Khaleel Ahmed, Nathan Ellis To SRH; Land 2 Players In Exchange | Sakshi
Sakshi News home page

IPL 2027: భారీ ట్రేడ్ డీల్‌.. రూ.7 కోట్ల న‌ష్టంతో సీఎస్‌కేలోకి విధ్వంస‌క‌ర ప్లేయ‌ర్‌

Nov 5 2026 2:57 PM | Updated on Nov 5 2026 3:09 PM

CSK Trade Khaleel Ahmed, Nathan Ellis To SRH; Land 2 Players In Exchange

ఐపీఎల్‌-2027 సీజ‌న్‌కు ముందు చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య భారీ ట్రేడ్ డీల్ జ‌రిగింది. సీఎస్‌కే, ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంచైజీలు త‌మ జ‌ట్లలోని నలుగురు ఆట‌గాళ్ల‌ను ప‌ర‌స్ప‌రం మార్చుకున్న‌ట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అధికారికంగా ప్ర‌క‌టించింది.

సీఎస్‌కేకి వ‌చ్చిన ఆట‌గాళ్లు
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ లియామ్ లివింగ్‌స్టోన్‌, ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ జాక్ ఎడ్వ‌ర్డ్స్‌లు ఎస్ఆర్‌హెచ్ నుంచి సీస్‌కేకు ట్రేడ్ అయ్యారు. గ‌త సీజ‌న్ వేలంలో లివింగ్‌స్టోన్‌ను రూ. 13 కోట్ల భారీ ధ‌ర‌కు స‌న్‌రైజ‌ర్స్ కొనుగోలు చేసింది. కానీ ఇప్పుడు అత‌డు రూ.7 కోట్లు త‌గ్గించుకుని రూ.6 కోట్ల‌కు సీఎస్‌కేతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

జాక్ ఎడ్వర్డ్స్ మాత్రం త‌న ప్ర‌స్తుత ధ‌ర రూ.3 కోట్ల‌కే సీఎస్‌కేతో జ‌త‌క‌ట్టాడు. వీరిద్దరికి బదులుగా సీఎస్‌కే.. పేస్ బౌల‌ర్లు ఖలీల్ అహ్మ‌ద్‌( రూ. 4.8 కోట్లు),   నాథన్ ఎల్లిస్( రూ. 2 కోట్ల)ను ఎస్ఆర్‌హెచ్‌లోకి పంపింది. ఎల్లిస్‌, ఖలీల్ అహ్మ‌ద్ వంటి స్టార్ పేస‌ర్లు రావ‌డంతో ఎస్ఆర్‌హెచ్ పేస్ బౌలింగ్ మ‌రింత ప‌టిష్ట‌మైంది.
చదవండి: Ranji Trophy 2026-27: రంజీ ట్రోఫీలో సంచ‌ల‌నం.. సౌరాష్ట్ర‌ను చిత్తు చేసిన త్రిపుర‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement