PC: BCCI/ipl
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌లో తమ తొలి మ్యాచ్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా సన్‌రైజర్స్ ఆటగాడు, కర్ణాటక సూపర్ స్టార్ స్మరణ్ రవిచంద్రన్ ఎంపికయ్యాడు.
మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికి సెలక్టర్లు మత్రం స్మరణ్‌కు జట్టు పగ్గాలను అప్పగించారు. గత సీజన్‌లో రవిచంద్రన్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. నాలుగు సెంచరీలతో సహా మొత్తం 950 పరుగులు లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే అతడిని కెప్టెన్‌గా నియమించారు. కాగా ఈ జట్టులో టీమిండియా స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, ప్రసిద్ద్ కృష్ణలకు చోటు దక్కింది.
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నాహకాల్లో భాగంగా వీరిద్దరూ రంజీ ట్రోఫీలో ఆడనున్నారు. ప్రసిద్ద్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నప్పటికి అక్టోబర్ 11న ఆంధ్రతో ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ సమయానికి కోలుకుంటాడని సెలక్టర్లు భావిస్తున్నారు. కాగా ఆంధ్రతో మ్యాచ్‌తో మరో కర్ణాటక సూపర్ స్టార్ దేవ్‌దత్ పడిక్కల్ మాత్రం అందుబాటులో లేడు. అతడు ఇండియా-ఎ జట్టులో భాగం కావడంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.
కర్ణాటక రంజీ ట్రోఫీ జట్టు
స్మరణ్ రవిచంద్రన్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్, అనీశ్వర్ గౌతమ్, కరుణ్ నాయర్, అనీష్ కెవి, శ్రేయాస్ గోపాల్, కృతిక్ కృష్ణ (వికెట్ కీపర్), శ్రీఖర్ శెట్టి, ప్రసిద్ధ్ కృష్ణ, అభిలాష్ శెట్టి, మన్వంత్ కుమార్, ఎల్ఆర్ కుమార్, రితేష్ భత్కల్, కెఎల్ శ్రీజిత్
చదవండి: IND vs WI: 'అతడికి వన్డేలు సెట్ కావు.. టెస్టుల్లో ఆడించండి'


