breaking news
mithun manhas
-
BCCI అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ ఎన్నిక
-
బీసీసీఐకి కొత్త బాస్.. అధికారిక ప్రకటన
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ (Mithun Manhas) నియమితుడయ్యాడు. ముంబైలో ఆదివారం జరిగిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో కొత్త బాస్‌కు సంబంధించిన నిర్ణయం జరిగింది. 45 ఏళ్ల మిథున్ మన్హాస్ పోటీ అన్నదే లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.దేశీ క్రికెట్లో పరుగుల వరదకాగా జమ్మూ కశ్మీర్‌కు చెందిన మిథున్ మన్హాస్ ఢిల్లీ తరఫున సుదీర్ధకాలం దేశవాళీ క్రికెట్ ఆడాడు. 1997- 2017 వరకు కొనసాగిన కెరీర్లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 157 మ్యాచ్‌లు ఆడిన మిథున్.. 27 శతకాల సాయంతో 9714 పరుగులు సాధించాడు. అదే విధంగా.. లిస్ట్-‘ఎ’ క్రికెట్లో 130 మ్యాచ్‌లలో కలిపి 4126 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉండటం విశేషం.ఇక టీ20 ఫార్మాట్లో 91 మ్యాచ్‌లు ఆడిన మన్హాస్ 1170 పరుగులు చేశాడు. అయితే, మిడిలార్డర్ బ్యాటర్ అయిన మన్హాస్‌కు.. తన కెరీర్లో ఎప్పుడూ అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం రాలేదు. టీమిండియా తరఫున అరంగేట్రం చేయకుండానే మన్హాస్ ఆటకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది.ఇక ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ (డేర్‌డెవిల్స్), పుణె వారియర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఆడిన మిథున్ మన్హాస్.. మొత్తంగా 55 మ్యాచ్‌లు ఆడి 514 పరుగులు రాబట్టాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్‌గా మారిన మన్హాస్.. ఐపీఎల్ ఫ్రాంఛైజీలు పంజాబ్ కింగ్స, గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ జట్ల సహాయక బృందంతో కీలక పాత్ర పోషించాడు.కోచ్‌గానూ సేవలుఅంతేకాదు బంగ్లాదేశ్ పురుషుల అండర్-19 జట్టుకు బ్యాటింగ్ సలహాదారుడిగానూ మిథున్ మన్హాస్ పనిచేశాడు. ఇక జమ్మూ కశ్మీర్ క్రికెట్‌ను గాడిన పెట్టే క్రమంలో బీసీసీఐ నియమించిన కమిటిలో ఉన్న మిథున్‌కు క్రీడా పరిపాలనలోనూ అనుభవం ఉంది.అనూహ్యంగా తెరపైకిఅయితే, ఊహించని రీతిలో మిథున్ మన్హాస్ ఏకంగా బీసీసీఐ అధ్యక్షుడిగా.. అది కూడా పోటీలేకుండా ఏకగ్రీవం కావడం విశేషం.బోర్డు పెద్దల అండదండలతోనే అతడికి పదవి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా 70 ఏళ్ల వయసు నిండిన కారణంగా రోజర్ బిన్నీ.. బోర్డు నిబంధనల ప్రకారం ఇటీవలే బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో బిన్నీ స్థానంలో ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు. తాజాగా మన్హాస్ ఎంపిక అధికారికం కావడంతో.. బిన్నీ వారసుడిగా అతడు బాధ్యతలు చేపట్టనున్నాడు. సరికొత్త చరిత్రతద్వారా సౌరవ్ గంగూలీ, బిన్నీ తర్వాత బీసీసీఐ బాస్ అయిన మూడో క్రికెటర్‌గా.. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఆడకుండానే ఈ పదవిని అలంకరించిన తొలి ఆటగాడిగా మన్హాస్ చరిత్ర సృష్టించాడు.చదవండి: ఆసియా కప్ ఫైనల్: బలహీనంగానే పాకిస్తాన్.. భయపెడుతున్న ముఖాముఖి రికార్డు! -
బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్!
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడు ఖరారయ్యాడు. ఏమాత్రం ఊహించని రీతిలో ఢిల్లీ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మిథున్ మన్హాస్ బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్ వేశాడు. రోజర్ బిన్నీ పదవీకాలం గత నెలతో ముగియగా... అప్పటి నుంచి ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఈ నెల 28న ముంబై వేదికగా జరగనున్న బోర్డు సమావేశంలో ఆఫీస్ బేరర్లు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. జమ్ముకశ్మీర్‌కు చెందిన 45 ఏళ్ల మిథున్ మన్హాస్... దేశవాళీల్లో ఢిల్లీ జట్టుకు సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించాడు. ఆదివారంతో నామినేషన్ల గడువు ముగియగా... అధ్యక్ష పదవికి మిథున్ ఒక్కడే దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో అతడి ఎంపిక ఏకగ్రీవమైనట్లే. ఇక కోశాధికారిగా భారత మాజీ క్రికెటర్ రఘురామ్ భట్ ఎన్నిక కానున్నాడు. ప్రస్తుతం అతడు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. శనివారం ఢిల్లీ వేదికగా జరిగిన సమావేశంలోనే మన్హాస్ పేరు తెరపైకి వచ్చినట్లు సమాచారం. ఐసీసీ అధ్యక్షుడు జై షా, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి దేవజిత్ సైకియా, ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రోహన్ జైట్లీతో పాటు బోర్డు ప్రస్తుత, మాజీ కీలక సభ్యుల సమక్షంలో జరిగిన సమావేశంలో మన్హాస్‌ను అధ్యక్షుడిగా నియమించాలని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ‘కొత్త పాలక వర్గం ఏర్పాటవుతోంది. ఢిల్లీ మాజీ ఆటగాడు మిథున్ మన్హాస్‌ని అధ్యక్షుడిని చేయాలని నిర్ణయించారు. ఐపీఎల్ గవరి్నంగ్ కౌన్సిల్ చైర్మన్‌గా అరుణ్ ధుమాల్ కొనసాగుతారు’అని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపాడు. » కొత్త అధ్యక్షుడి ఎన్నిక తర్వాత కూడా ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, కార్యదర్శిగా దేవజిత్ సైకియా కొనసాగనున్నారు. ప్రస్తుతం బోర్డు కోశాధికారిగా వ్యవహరిస్తున్న ఛత్తీస్‌గఢ్ క్రికెట్ సంఘానికి చెందిన ప్రభ్‌తేజ్ భాటియా... తదుపరి సంయుక్త కార్యదర్శిగా పనిచేయనున్నాడు. » సౌరాష్ట్ర మాజీ కెపె్టన్ జయ్‌దేవ్ షా బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్లో భాగం కానున్నాడు. ఇప్పుడా స్థానంలో ఉన్న ఖైరుల్ జమాల్ మజుందార్ ఐపీఎల్ పాలక మండలికి వెళ్లనున్నాడు. » ప్రస్తుతం కార్యదర్శిగా కొనసాగుతున్న దేవజిత్ సైకియా అదే పోస్ట్‌కు ఆదివారం నామినేషన్ దాఖలు చేశాడు. త్వరలో స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం రెండు రోజుల్లో జట్టును ఎంపిక చేయనున్నట్లు సైకియా తెలిపాడు. » భారత్, వెస్టిండీస్ మధ్య వచ్చే నెల 2 నుంచి అహ్మదాబాద్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025–27 సైకిల్లో టీమిండియాకు ఇదే మొదటి మ్యాచ్ కానుంది. ఎవరీ మన్హాస్...! అంచనాలకు అందకుండా అనూహ్యంగా తెరపైకి వచ్చిన మిథున్ మన్హాస్... బీసీసీఐ 37వ అధ్యక్షుడిగా ఎంపికవడం ఖాయమైంది. పెద్దల అండదండలతో బరిలో నిలిచిన మన్హాస్‌కు పోటీనే లేకుండా పోయింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి అనుభవం ఉన్న మిథున్... కెరీర్లో 157 మ్యాచ్‌లాడి 9714 పరుగులు చేశాడు. అందులో 27 సెంచరీలు ఉన్నాయి. లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో 130 మ్యాచ్‌లాడి 4126 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు, 26 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. 91 టి20ల్లో 1170 పరుగులు చేశాడు. ఐపీఎల్లో మూడు (ఢిల్లీ క్యాపిటల్స్, పుణే వారియర్స్ ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్) జట్లకు ప్రాతినిధ్యం వహించిన మన్హాస్... ఓవరాల్‌గా 55 మ్యాచ్‌లాడి 514 పరుగులు చేశాడు. 1997–98 సీజన్లో దేశవాళీ కెరీర్ ప్రారంభించిన మిథున్ 2016–17 వరకు కెరీర్ కొనసాగించాడు. కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన సమయంలో భారత జట్టు మిడిలార్డర్లో తీవ్రమైన పోటీ ఉండటంతో... అతడికి అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం దక్కలేదు. ఆటగాడిగా సుదీర్ఘ అనుభవం ఉన్న మన్హాస్... ఆ తర్వాత కోచ్‌గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. క్రీడా పరిపాలనలోనూ అతడికి అనుభవం ఉంది. జమ్మూకశ్మీర్ క్రికెట్‌ను గాడిన పెట్టేందుకు బీసీసీఐ నియమించిన కమిటీలో మిథున్ సభ్యుడిగా పనిచేశాడు. అందుకోసం 2015లో ఢిల్లీ నుంచి జమ్ముకశ్మీర్‌కు మారాడు. ఆ మరుసటి ఏడాదే కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఆపై బంగ్లాదేశ్ పురుషుల అండర్–19 జట్టుకు బ్యాటింగ్ సలహాదారుడిగా పనిచేసిన మిథున్... ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్‌లో సహయ బృందంలో కీలకంగా వ్యవహరించాడు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి పలువురు ప్లేయర్లు ఢిల్లీ జట్టులో మన్హాస్ సారథ్యంలో ఆడారని... అండర్–19 స్థాయిలో అతడితో కలిసి ఆడిన టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా గుర్తుచేసుకున్నాడు. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ వంటి హేమాహేమీలు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన సమయంలో మిడిలార్డర్లో చోటుదక్కకే మన్హాస్‌కు జాతీయ సెలెక్టర్ల నుంచి పిలుపు రాలేదని చోప్రా అభిప్రాయపడ్డాడు. -
BCCI: అధ్యక్ష పదవి రేసులో ఊహించని పేరు.. ఎవరీ ఆటగాడు?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్ష పదవి రేసులో మరో కొత్త పేరు తెరమీదకు వచ్చింది. దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన మిథున్ మన్హాస్ (Mithun Manhas) బీసీసీఐ కొత్త బాస్ కాబోతున్నాడనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాగా రోజర్ బిన్నీ బీసీసీఐ (BCCI) అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.బోర్డు నిబంధనల ప్రకారం 70 ఏళ్లు నిండిన వారు అధ్యక్ష పదవిలో కొనసాగకూడదు. బిన్నీ ఇటీవలే 70వ పడిలోకి అడుగుపెట్టినందున.. నిబంధనలకు లోబడి రాజీనామా చేశారు. బిన్నీ స్థానంలో బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఈ నేపథ్యంలో బీసీసీఐ కాబోయే అధ్యక్షుడిగా టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్తో పాటు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తదితరుల పేర్లు వినిపించాయి. అయితే, సచిన్ ఈ వార్తలను ఇప్పటికే ఖండించాడు.ఈ క్రమంలో మిథున్ మన్హాస్ కొత్తగా మీదకు వచ్చాడు. అతడితో పాటు మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరె బోర్డులో చేరనున్నట్లు సమాచారం. ఇక సెప్టెంబరు 28న జరిగే బీసీసీఐ సర్వ సభ్య సమావేశం సందర్భంగా కొత్త అధ్యక్షుడు ఎవరన్నది తేలనుంది.ఎవరీ మిథున్ మన్హాస్?జమ్ము కశ్మీర్‌కు చెందిన 45 ఏళ్ల మన్హాస్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 157 మ్యాచ్‌లు ఆడి 9714 పరుగులు సాధించాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్డెవిలల్స్, పుణె వారియర్స్‌కు ఆడాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయకుండానే అతడి కెరీర్ ముగిసిపోయింది. ఒకవేళ మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఖరారైతే.. టీమిండియాకు ఆడకుండానే బాస్ అయిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కుతాడు. -
పంజాబ్ కింగ్స్ అసిస్టెంట్ కోచ్‌గా మన్హాస్
న్యూఢిల్లీ: ఐపీఎల్ పదో సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు తమ అసిస్టెంట్ కోచ్‌గా మిథున్ మన్హాస్‌ను ఎంపిక చేసుకుంది. అతడు గతంలో చెన్నై సూపర్ కింగ్స్, పుణే, ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఐపీఎల్లో ఆడాడు. అలాగే రంజీల్లో ఢిల్లీ జట్టు తరఫున బరిలోకి దిగాడు. అలాగే బ్యాటింగ్ కోచ్‌గా జె.అరుణ్ కుమార్ వ్యవహరించనున్నాడు. రంజీ ట్రోఫీలో అతను కర్ణాటక జట్టు కోచ్‌గా వ్యవహరించగా ఐపీఎల్లో బెంగళూరుకు ఆడిన అనుభవం ఉంది. వీరితో పాటు ఫిజియోథెరపిస్ట్‌గా అమిత్ త్యాగి, మనోజ్ కుమార్ యోగా శిక్షకుడిగా ఉండనున్నారు. ఆర్.శ్రీధర్ ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగుతారు. వీరంతా టీమ్ మెంటార్‌గా ఉన్న సెహ్వాగ్ ఆధ్వర్యంలో పనిచేస్తారని జట్టు వర్గాలు తెలిపాయి.


