పంజాబ్‌ కింగ్స్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా మన్హాస్‌ | mithun manhas apponted as assistant coach of kings punjab next ipl | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ కింగ్స్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా మన్హాస్‌

Feb 18 2017 10:26 AM | Updated on Sep 5 2017 4:02 AM

పంజాబ్‌ కింగ్స్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా మన్హాస్‌

పంజాబ్‌ కింగ్స్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా మన్హాస్‌

ఐపీఎల్‌ పదో సీజన్‌ కోసం పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ జట్టు తమ అసిస్టెంట్‌ కోచ్‌గా మిథున్‌ మన్హాస్‌ను ఎంపిక చేసుకుంది.

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ పదో సీజన్‌ కోసం పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ జట్టు తమ అసిస్టెంట్‌ కోచ్‌గా మిథున్‌ మన్హాస్‌ను ఎంపిక చేసుకుంది. అతడు గతంలో చెన్నై సూపర్‌ కింగ్స్, పుణే, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తరఫున ఐపీఎల్‌లో ఆడాడు. అలాగే రంజీల్లో ఢిల్లీ జట్టు తరఫున బరిలోకి దిగాడు. అలాగే బ్యాటింగ్‌ కోచ్‌గా జె.అరుణ్‌ కుమార్‌ వ్యవహరించనున్నాడు. రంజీ ట్రోఫీలో అతను కర్ణాటక జట్టు కోచ్‌గా వ్యవహరించగా ఐపీఎల్‌లో బెంగళూరుకు ఆడిన అనుభవం ఉంది.

 

వీరితో పాటు ఫిజియోథెరపిస్ట్‌గా అమిత్‌ త్యాగి, మనోజ్‌ కుమార్‌ యోగా శిక్షకుడిగా ఉండనున్నారు. ఆర్‌.శ్రీధర్‌ ఫీల్డింగ్‌ కోచ్‌గా కొనసాగుతారు. వీరంతా టీమ్‌ మెంటార్‌గా ఉన్న సెహ్వాగ్‌ ఆధ్వర్యంలో పనిచేస్తారని జట్టు వర్గాలు తెలిపాయి.


 

Advertisement
 
Advertisement
Advertisement