breaking news
UP T20 League
-
రింకూ సింగ్ విధ్వంసకర సెంచరీ.. 8 సిక్స్‌లతో వీర వీహారం! వీడియో
ఆసియాకప్-2025కు ముందు టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్ విధ్వంసం సృష్టించాడు. యూపీ టీ20 లీగ్-2025లో మీరట్ మావెరిక్స్ సారథ్యం వహించిన రింకూ సింగ్.. గురువారం గౌర్ గోరఖ్ పూర్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.168 పరుగుల లక్ష్య చేధనలో ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రింకూ పత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. లక్నోలని ఎకానా స్టేడియంలో రింకూ బౌండరీల వర్షం కురిపించాడు. ఓటమి ఖాయమైన చోట ఈ లెఫ్ట్ హ్యాండర్ తన తుపాన్ ఇన్నింగ్స్‌తో అద్భుతం చేశాడు.కేవలం 48 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సింగ్.. 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 108 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. దీంతో 168 పరుగుల టార్గెట్‌ను మీరట్ మావెరిక్స్ 4 వికెట్లు కోల్పోయి చేధించింది. గోరఖ్ పూర్ బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, అనికిత్ చౌదరీ, ఏ రెహమన్, విజయ్ యాదవ్ తలా వికెట్ సాధించారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన గోరఖ్ పూర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. గోరఖ్‌పూర్ కెప్టెన్ ధ్రువ్ జురెల్(38) టాప్ స్కోరర్‌గా నిలవగా.. నిశాంత్ కుష్వాహా(37), శివమ్ శర్మ(25) రాణించారు. మీరట్ బౌలర్లలో విశాల్ చౌదరి, విజయ్ కుమార్ తలా మూడు వికెట్లు పగొట్టగా.. జీసన్ అన్సారీ రెండు వికెట్లను తీశాడు.ఇక ఇది ఇలా ఉండగా.. ఆసియాకప్‌నకు ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో రింకూ సింగ్‌కు చోటు దక్కింది. అయితే ఫామ్లేనప్పటికి రింకూకు ఛాన్స్ ఇవ్వడాన్ని చాలా మంది తప్పుబట్టారు. కానీ ఇప్పుడు తనపై విమర్శలు చేసిన వారికి రింకూ బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు.ఆసియా కప్ టీ20-2025 టోర్నమెంట్‌కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.చదవండి: UPT20: రింకూ సింగ్ విధ్వంసకర సెంచరీ.. 8 సిక్స్‌లతో వీర వీహారం! వీడియోChasing a target of 168, Rinku walks in at 38-4. Scores unbeaten 108 off 48. Wins the game in the 19th over. 🤯The One. The Only. RINKU SINGH! 🦁 💜pic.twitter.com/YCjQcLMcaH— KolkataKnightRiders (@KKRiders) August 21, 2025 -
టీమిండియా యువ బౌలర్ విధ్వంసం.. 19 బంతుల్లో హాఫ్ సెంచరీ, 3 వికెట్లు
యూపీ టీ20 లీగ్‌లో టీమిండియా యువ బౌలర్, కేకేఆర్ మాజీ మీడియం పేసర్ శివమ్ మావి విధ్వంసం సృష్టించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి మెరుపులు మెరిపించాడు. ఈ లీగ్‌లో కాశీ రుద్రాస్‌కు ఆడుతున్న మావి.. గోరఖ్‌పూర్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఇందులో 6 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 21 బంతులు ఎదుర్కొన్న మావి 54 పరుగులు చేసి ఔటయ్యాడు.ఎనిమిదో వికెట్‌కు మావి శివ సింగ్‌తో (17 బంతుల్లో 34 నాటౌట్; 4 సిక్సర్లు) కలిసి 87 పరుగులు జోడించాడు. మావి, శివ సింగ్ ఇన్నింగ్స్ చివర్లో సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడటంతో రుద్రాస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఈ జట్టు తరఫున కెప్టెన్ కరణ్ శర్మ (39), యశోవర్దన్ సింగ్ (23) కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. గోరఖ్‌పూర్ బౌలర్లలో అబ్దుల్ రెహ్మాన్ 3, శివమ్ శర్మ 2, ప్రిన్స్ యాదవ్, వాసు వట్స్, విజయ్ యాదవ్ తలో వికెట్ తీశాడు.అనంతరం మావి బౌలింగ్‌లోనూ రాణించాడు. 3.1 ఓవర్లలో 24 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. మావి ఆల్‌రౌండ్ షోతో చెలరేగడంతో రుద్రాస్ గోరఖ్‌పూర్ జట్టుపై 50 పరుగుల తేడాతో గెలుపొందింది. మావితో పాటు అటల్ బిహారీ రాయ్ (4-0-13-3), కార్తీక్ యాదవ్ (3-0-14-2), సునీల్ కుమార్ (3-0-25-1) కూడా సత్తా చాటడంతో గోరఖ్‌పూర్ జట్టు 19.1 ఓవర్లలో 126 పరుగులకే టపా కట్టేసింది. గోరఖ్‌పూర్ తరఫున ప్రిన్స్ యాదవ్ (29 బంతుల్లో 49; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ ఆకాశ్‌దీప్ నాథ్ (34) పోరాటం చేశారు. అయితే అప్పటికే ఆ జట్టు ఓటమి ఖరారైపోయింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసిన మావికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.26 ఏళ్ల మావిని 2018 ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ రూ. 3 కోట్ల రికార్డు ధర చెల్లించి సొంతం చేసుకుంది. మావి కేకేఆర్ తరఫున 32 మ్యాచ్‌లు ఆడి 30 వికెట్లు తీశాడు. అనంతరం 2024 సీజన్ మెగా వేలంలో మావిని లక్నో సూపర్ జెయింట్స్ ఊహించని ధర (రూ. 6.4 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్ ప్రారంభానికి ముందే అతను పక్కటెముకల గాయంతో వైదొలిగాడు.ఐపీఎల్ ప్రదర్శనల కారణంగా మావికి 2023లో టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. అరంగేట్రం టీ20లోనే అతను 4 వికెట్ల ప్రదర్శనతో చెలరేగి సత్తా చాటాడు. అయితే ఆతర్వాత మ్యాచ్‌ల్లో రాణించలేకపోవడంతో మావి అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు 6 మ్యాచ్‌లతోనే బ్రేక్ పడింది. -
గర్జించిన రింకూ సింగ్.. విధ్వంసకర బ్యాటర్లో ఈ కోణం కూడా ఉందా..!
టీమిండియా టీ20 స్పెషలిస్ట్ రింకూ సింగ్‌లో కొత్త కోణం బయటపడింది. ఈ విధ్వంసకర మిడిలార్డర్ బ్యాటర్.. స్వరాష్ట్రంలో జరుగుతున్న యూపీ టీ20 లీగ్‌లో బౌలర్ అవతారమెత్తాడు. అవతారమెత్తడమే కాకుండా ఈ విభాగంలోనూ సత్తా చాటాడు.ఈ లీగ్‌లో మీరట్ మెవరిక్స్కు ఆడుతున్న రింకూ.. ఇవాళ (ఆగస్ట్ 18) కాన్పూర్ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 ఓవర్లు స్పిన్ బౌలింగ్ వేసి ఆదర్శ్ సింగ్ అనే బ్యాటర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ వికెట్ తీశాక రింకూ తీవ్ర ఉద్వేగానికి లోనై గర్జించసాగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.King Rinku @rinkusingh235 rattles the stumps on his first ball! The Captain announces his arrival. #UPT20League #ANAXUPT20League #KhiladiYahanBantaHai #MMvsKS pic.twitter.com/mLwjJWVRSw— UP T20 League (@t20uttarpradesh) August 17, 2025రింకూలోని బౌలింగ్ నైపుణ్యాన్ని చూసి టీమిండియా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత జట్టుకు మరో ఆల్‌రౌండర్ దొరికాడంటూ సంబరపడిపోతున్నారు.కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం బ్యాటింగ్‌నే నమ్ముకుంటే టీమిండియాలో చోటు దక్కడం కష్టంగా మారింది. ఆటగాళ్లంతా అదనంగా మరో విభాగంలో (బ్యాటర్లైతే బౌలింగ్ లేదా వికెట్‌కీపింగ్, బౌలర్లైతే బ్యాటింగ్) సత్తా చాటితేనే ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కే అవకాశం ఉంది.ఈ విషయాన్ని రింకూ గ్రహించినట్లున్నాడు. కేవలం బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తే సరిపోదు, అదనంగా మరో టాలెంట్‌ను జోడించుకోవాలని భావించి బంతి పట్టాడు. ఈ క్రమంలో తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించాడు. ఆసియా కప్ జట్టులో చోటు ప్రశ్నార్థకమైన వేల రింకూ తనలోని బౌలింగ్ టాలెంట్‌ను బయటికి తీసి సెలెక్టర్లను ఇంప్రెస్ చేశాడు.బౌలర్‌గా రాణించినా ఆసియా కప్ జట్టులో రింకూకు చోటు దక్కుతుందని చెప్పలేని పరిస్థితి. ఖండాంతర టోర్నీకి ముందు 15 బెర్త్‌ల కోసం 20 మంది పోటీపడుతున్నారు. లోయరార్డర్లో ఓ బెర్త్ కోసం రింకూ సింగ్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. రింకూతో పోలిస్తే రియాన్ పరాగ్, సుందర్ మెరుగైన బౌలర్లు. వారితో పోటీలో రింకూ ఏమేరకు నెగ్గుకొస్తాడో చూడాలి.మ్యాచ్ విషయానికొస్తే.. రింకూ జట్టు మీరట్ కార్పూర్ జట్టుపై 86 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్.. మాధవ్ కౌశిక్ (31 బంతుల్లో 95) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో రింకూకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అనంతరం ఛేదనలో కాన్పూర్ జట్టు తడబడింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. -
లైంగిక వేధింపుల కేసు.. ఆర్సీబీ స్టార్ బౌలర్‌పై బ్యాన్!?
లైంగిక వేదింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాల్‌కు మరో భారీ షాక్ తగిలింది. యూపీఎల్ టీ20 లీగ్-2025లో పాల్గొనకుండా అతడిపై ఉత్తరప్రదేశ్ క్రికెట్ ఆసోషియేషన్ నిషేదం విధించినట్లు తెలుస్తోంది. ఇటీవలే దయాల్‌పై పోక్సో కేసు నమోదు కావడంతో యూపీ క్రికెట్ ఆసోయేషిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ ఏడాది జూలైలో దయాల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని జైపూర్‌కు చెందిన 17 ఏళ్ల మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జైపూర్‌లోని సంగనేర్ సదర్ పోలీసులు అతడిపై పొక్సో కేసు నమోదు చేశారు. అంతకంటే ముందు దయాల్‌పై మరో లైంగిక వేదింపుల కేసు కూడా నమోదైంది.వివాహం చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఘజియాబాద్‌కు చెందిన ఒక అమ్మాయి దయాల్‌పై ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో అతడి అరెస్టుపై అలహాబాద్ హైకోర్టుపై స్టే విధించింది. ఈ వరుస కేసుల నేపథ్యంలో దయాల్‌పై ఉత్తరప్రదేశ్ క్రికెట్ ఆసోషియేషన్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడిపై వేటుకు యూపీసీఎ సిద్దమైనట్లు వినికిడి.కాగా ప్రయోగ్‌రాజ్‌కు చెందిన దయాల్‌ను యూపీటీ20 వేలంలో గోరఖ్‌పూర్ లయన్స్ రూ. 7 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ ఇప్పుడు యూపీసీఎ నిర్ణయంతో గోరఖ్‌పూర్ దయాల్ సేవలను కోల్పోయే అవకాశముంది. అయితే గోరఖ్‌పూర్ లయన్స్ యాజమాన్యానికి ఇంకా యూపీసీఎ నుంచి దయాల్‌కు సంబంధించి ఎటువంటి ఆదేశాలు అందలేని దైనక్ జాగరణ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది.అంతేకాకుండా త్వరలోనే యూపీసీఎ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని మరిన్ని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇక ఈ ఏడాది యూపీ టీ20 లీగ్ ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: సాయి సుదర్శన్‌కు మరోసారి మొండిచేయి.. ప్లాన్ ఏంటి? -
బంతితో చెలరేగిన రింకూ సింగ్.. ఒకే ఓవర్లో మూడు వికెట్లు
ఇప్పటి వరకు తన బ్యాటింగ్ మెరుపులతో ఆకట్టుకున్న టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్.. ఇప్పుడు తన బౌలింగ్ నైపుణ్యాలతోనూ అభిమానులను ఫిదా చేస్తున్నాడు. దీంతో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఇలాగే నిలకడగా రాణిస్తే భారత జట్టుకు మరో అదనపు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ దొరికినట్టేనంటూ అతడిని ప్రశంసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకూ సింగ్ యూపీ టీ20 లీగ్ 2024లో మీరట్ మెవెరిక్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.ఈ క్రమంలో సారథ్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న రింకూ... ఆల్‌రౌండ్ ప్రతిభతోనూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల నోయిడా సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 64 పరుగులు చేయడంతో పాటు రెండు కీలక వికెట్లు తీసిన విషయం తెలిసిందే. తాజాగా కాన్పూర్ సూపర్‌స్టార్స్‌తో మ్యాచ్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు.ఏకనా క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్ మెవెరిక్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన స్వస్తిక్ చికరా డకౌట్ అయ్యాడు. అయితే, మరో ఓపెనర్ అక్షయ్ దూబే సైతం 14 బంతుల్లో 11 పరుగులు చేసి నిష్క్రమించాడు.ఆ తర్వాతి స్థానంలో వచ్చిన మాధవ్ కౌశిక్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించినా.. క్రమంగా క్రీజులో పాతుకుపోయి అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. మాధవ్ 18, రితురాజ్ శర్మ 14 పరుగులతో ఉన్న సమయంలో వర్షం ఆటంకం కలిగించింది. ఈ క్రమంలో మ్యాచ్‌ను తొమ్మిది ఓవర్లకు కుదించారు. అప్పటికి మెవెరిక్స్ స్కోరు 49-2.26 బంతుల్లో 52 పరుగులువర్షం తగ్గిన తర్వాత మళ్లీ ఆట మొదలుపెట్టగా మాధవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో నిర్ణీత తొమ్మిది ఓవర్లలో మెవెరిక్స్ మూడు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.ఈ నేపథ్యంలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం కాన్పూర్ సూపర్‌స్టార్స్‌కు 106 పరుగుల లక్ష్యం విధించారు. ఈ క్రమంలో ఐదు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసిన కాన్పూర్ టార్గెట్ ఛేదించేలా కనిపించింది. అయితే, ఆరో ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన మెవెరిక్స్ కెప్టెన్ రింకూ సింగ్.. స్పిన్ మాయాజాలంతో కాన్పూర్ బ్యాటర్లకు వరుస షాకులిచ్చాడు.ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన రింకూ సింగ్ఈ రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్‌కు ఫోర్‌తో స్వాగతం పలికిన శౌర్య సింగ్(5).. ఆ మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఆదర్శ్ సింగ్, సుధాంశుల వికెట్లు కూడా పడగొట్టాడు రింకూ. ఒకే ఓవర్లో మూడు వికెట్లు(3/7) పడగొట్టి కాన్పూర్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఈ క్రమంలో 7.4 ఓవర్లలోనే కాన్పూర్ కథ(83 రన్స్) ముగియగా.. 22 పరుగుల తేడాతో మీరట్ మెవెరిక్స్ జయభేరి మోగించింది. దీంతో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదింట గెలిచి పాయింట్ల పట్టికలో మొదటిస్థానంలో నిలిచింది. View this post on Instagram A post shared by UP T20 League (@t20uttarpradesh) -
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన రింకూ సింగ్
యూపీ టీ20 లీగ్‌లో టీమిండియా చిచ్చరపిడుగు రింకూ సింగ్ చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన అతను.. మూడింటిలో అజేయంగా (7 నాటౌట్ (2), 48 నాటౌట్ (35), 64 నాటౌట్ (35)) నిలిచి 119 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో మీరట్ మెవెరిక్స్‌కు నాయకత్వం వహిస్తున్న రింకూ.. తాజాగా నోయిడా సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన మెవెరిక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. మెవెరిక్స్ ఇన్నింగ్స్‌లో రింకూతో పాటు మాధవ్ కౌశిక్ (40) రాణించాడు. నోయిడా బౌలర్లలో నమన్ తివారి, కునాల్ త్యాగి చెరో 2 వికెట్లు పడగొట్టగా.. పియూశ్ చావ్లా, కార్తికేయ యాదవ్, నితీశ్ రాణా తలో వికెట్ దక్కించుకున్నారు.164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నోయిడా.. నిర్ణీత ఓవర్లలో 152 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) పరిమితమై 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కావ్య టియోటియా (65) నోయిడాను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఆఖర్లో ఆదిత్య శర్మ (8 బంతుల్లో 21) బ్యాట్ ఝులిపించినా ప్రయోజనం లేకుండా పోయింది. నోయిడా కెప్టెన్ నితీశ్ రాణా ఓ మోస్తరు స్కోర్ (21) చేశాడు. మెవెరిక్స్ బౌలర్లలో విజయ్ కుమార్ 3 వికెట్లు పడగొట్టాడు.బంతితోనూ రాణించిన రింకూ..బ్యాట్‌తో ఇరగదీసిన రింకూ సింగ్ బౌలింగ్‌లోనూ (2/18) సత్తా చాటాడు. విశాల్ చౌదరీ, యశ్ గార్గ్, జీషన్ అన్సారీ తలో వికెట్ పడగొట్టారు. -
భువనేశ్వర్ కుమార్‌కు జాక్ పాట్.. లీగ్ చరిత్రలోనే భారీ ధర
ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్-2024లో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. తొలి ఎడిషన్‌లో నోయిడా సూపర్ కింగ్స్‌కు ప్రాతనిథ్యం వహించిన భువనేశ్వర్.. ఈ ఏడాది సీజన్లో మాత్రం లక్నో ఫాల్కన్స్ తరపున ఆడనున్నాడు. ఆదివారం జరిగిన యూపీ టీ20 లీగ్ వేలంలో భువనేశ్వర్ కుమార్‌ను రూ. 30.25 లక్షల భారీ మొత్తానికి లక్నో ఫాల్కన్స్ కొనుగోలు చేసింది. దీంతో లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా భువీ రికార్డులకెక్కాడు. ఈ భారత వెటరన్ క్రికెటర్ కోసం కాన్పూర్ సూపర్ స్టార్స్ , గోరఖ్‌పూర్ లయన్స్ కూడా తీవ్రంగా శ్రమించాయి. కానీ వారి పర్స్‌లో తగినంత మొత్తం లేకపోవడంతో సదరు ఫ్రాంచైజీలు తమ నిర్ణయాన్ని మార్చుకున్నాయి. అయితే లక్నో ఫాల్కన్స్ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గకుండా అతడిపై భారీ మొత్తాన్ని వెచ్చింది. గత సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడిన భువీ 13 వికెట్లతో అదుర్స్ అన్పించాడు. కాగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న భువనేశ్వర్.. ప్రస్తుతం ఐపీఎల్లో కూడా ఆడుతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్-2021 మెగా వేలంలో అతడిని ఎస్ఆర్హెచ్ రూ. 4.21 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక యూపీ టీ20 లీగ్-2024 సీజన్ ఆగస్టు 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో నితీష్ రాణా, శివమ్ మావి, వెటరన్ క్రికెటర్ పీయూష్ చావ్లా వంటి వారు భాగం కానున్నారు. -
అవును.. టీమిండియాలో నాకు చోటు లేదు.. ఇక: భువీ కీలక నిర్ణయం
Bhuvneshwar Kumar Comments: ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022 ముగిసిన తర్వాత టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు జట్టులో ప్రాధాన్యం లేకుండా పోయింది. గతేడాది నవంబరులో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌లో అతడు ఆఖరిసారిగా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా అతడిని తప్పించింది బీసీసీఐ. ఈ క్రమంలో 33 ఏళ్ల భువీకి గత కొంతకాలంగా జట్టులో చోటు కరువైంది. ఈ నేపథ్యంలో ఈ యూపీ సీమర్ లీగ్ క్రికెట్‌కే పరిమితమయ్యాడు. ఐపీఎల్లో హైదరాబాద్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్న భువనేశ్వర్ కుమార్.. తాజా ఎడిషన్‌లో 14 మ్యాచ్‌లలో 16 వికెట్లు తీశాడు. ప్రస్తుతం అతడు యూపీ టీ20 లీగ్‌తో బిజీగా ఉన్నాడు. స్థానికంగా జరుగుతున్న ఈ క్రికెట్ టోర్నీలో భువీ ప్రాతినిథ్యం వహిస్తున్న నోయిడా సూపర్ కింగ్స్ టాప్‌లో కొనసాగుతోంది. భువీ(PC: SRH) ఈ నేపథ్యంలో నేషనల్న్యూస్తో మాట్లాడిన భువనేశ్వర్ కుమార్ జాతీయ జట్టులో పునరాగమనం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫాస్ట్‌బౌలర్‌గా తన అంతర్జాతీయ కెరీర్ చరమాంకానికి చేరిందన్న ఈ రైట్ఆర్మ్ పేసర్... ఇప్పుడు తన దృష్టంతా కేవలం ఆటను ఆస్వాదించడం మీదే ఉందని పేర్కొన్నాడు. కెరీర్ చరమాంకంలో ఉన్నాను ‘‘మన కెరీర్ ఎలా సాగుతుందన్న విషయం మనసు మనకు గుర్తుచేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను అదే స్టేజ్‌లో ఉన్నాను. కొన్నేళ్లపాటు మాత్రమే ఫాస్ట్‌బౌలర్‌గా మనగలను. అవును.. టీమిండియాలో నాకు చోటు లేదు. అయినా ఆ విషయం నన్ను బాధించడం లేదు. రీఎంట్రీ ఇచ్చేందుకు నేను ఇవన్నీ చేయడం లేదు. ఇంకొన్నాళ్ల పాటు నాణ్యమైన క్రికెట్ ఆడాలని మాత్రమే కోరుకుంటున్నా. ఈ క్రమంలో ఒకవేళ జాతీయ జట్టులో స్థానం దక్కితే దక్కొచ్చు. ఇకపై నా దృష్టి మొత్తం దానిమీదే అంతేగానీ.. ప్రత్యేకంగా తిరిగిరావడం కోసమే నేను ఈ ప్రయత్నాలు చేయడం లేదు. ఏ ఫార్మాట్లో అయినా.. ఎలాంటి లీగ్ ఆడుతున్నా మెరుగైన ప్రదర్శనలు ఇవ్వడం మీదే నా దృష్టి ఉంది’’ అని భువీ చెప్పుకొచ్చాడు. ఇకపై తాను లీగ్ క్రికెట్‌పై మరింతగా ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. కాగా భువనేశ్వర్ కుమార్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 63, 141, 90 వికెట్లు తీశాడు. లోకల్ టాలెంట్ వెలుగులోకి యూపీ వంటి రాష్ట్రంలో ఇలాంటి లీగ్‌లు స్థానిక ఆటగాళ్ల ప్రతిభను వెలికి తీసేందుకు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా భువనేశ్వర్ కుమార్ పేర్కొన్నాడు. కాగా ఆరు జట్ల మధ్య పోటీతో ఆగష్టు 30న యూపీ టీ20 లీగ్ ఆరంభమైంది. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో బీసీసీఐ మంగళవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: ప్రపంచకప్‌నకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. ఆ ముగ్గురు అవుట్! కెప్టెన్ సహా..