
లైంగిక వేదింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాల్‌కు మరో భారీ షాక్ తగిలింది. యూపీఎల్ టీ20 లీగ్-2025లో పాల్గొనకుండా అతడిపై ఉత్తరప్రదేశ్ క్రికెట్ ఆసోషియేషన్ నిషేదం విధించినట్లు తెలుస్తోంది. ఇటీవలే దయాల్‌పై పోక్సో కేసు నమోదు కావడంతో యూపీ క్రికెట్ ఆసోయేషిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ ఏడాది జూలైలో దయాల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని జైపూర్‌కు చెందిన 17 ఏళ్ల మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జైపూర్‌లోని సంగనేర్ సదర్ పోలీసులు అతడిపై పొక్సో కేసు నమోదు చేశారు. అంతకంటే ముందు దయాల్‌పై మరో లైంగిక వేదింపుల కేసు కూడా నమోదైంది.
వివాహం చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఘజియాబాద్‌కు చెందిన ఒక అమ్మాయి దయాల్‌పై ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో అతడి అరెస్టుపై అలహాబాద్ హైకోర్టుపై స్టే విధించింది. ఈ వరుస కేసుల నేపథ్యంలో దయాల్‌పై ఉత్తరప్రదేశ్ క్రికెట్ ఆసోషియేషన్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడిపై వేటుకు యూపీసీఎ సిద్దమైనట్లు వినికిడి.
కాగా ప్రయోగ్‌రాజ్‌కు చెందిన దయాల్‌ను యూపీటీ20 వేలంలో గోరఖ్‌పూర్ లయన్స్ రూ. 7 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ ఇప్పుడు యూపీసీఎ నిర్ణయంతో గోరఖ్‌పూర్ దయాల్ సేవలను కోల్పోయే అవకాశముంది. అయితే గోరఖ్‌పూర్ లయన్స్ యాజమాన్యానికి ఇంకా యూపీసీఎ నుంచి దయాల్‌కు సంబంధించి ఎటువంటి ఆదేశాలు అందలేని దైనక్ జాగరణ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది.
అంతేకాకుండా త్వరలోనే యూపీసీఎ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని మరిన్ని రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఇక ఈ ఏడాది యూపీ టీ20 లీగ్ ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: సాయి సుదర్శన్‌కు మరోసారి మొండిచేయి.. ప్లాన్ ఏంటి?