breaking news
UPCA
-
లైంగిక వేధింపుల కేసు.. ఆర్సీబీ స్టార్ బౌలర్‌పై బ్యాన్!?
లైంగిక వేదింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాల్‌కు మరో భారీ షాక్ తగిలింది. యూపీఎల్ టీ20 లీగ్-2025లో పాల్గొనకుండా అతడిపై ఉత్తరప్రదేశ్ క్రికెట్ ఆసోషియేషన్ నిషేదం విధించినట్లు తెలుస్తోంది. ఇటీవలే దయాల్‌పై పోక్సో కేసు నమోదు కావడంతో యూపీ క్రికెట్ ఆసోయేషిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ ఏడాది జూలైలో దయాల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని జైపూర్‌కు చెందిన 17 ఏళ్ల మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జైపూర్‌లోని సంగనేర్ సదర్ పోలీసులు అతడిపై పొక్సో కేసు నమోదు చేశారు. అంతకంటే ముందు దయాల్‌పై మరో లైంగిక వేదింపుల కేసు కూడా నమోదైంది.వివాహం చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఘజియాబాద్‌కు చెందిన ఒక అమ్మాయి దయాల్‌పై ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో అతడి అరెస్టుపై అలహాబాద్ హైకోర్టుపై స్టే విధించింది. ఈ వరుస కేసుల నేపథ్యంలో దయాల్‌పై ఉత్తరప్రదేశ్ క్రికెట్ ఆసోషియేషన్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడిపై వేటుకు యూపీసీఎ సిద్దమైనట్లు వినికిడి.కాగా ప్రయోగ్‌రాజ్‌కు చెందిన దయాల్‌ను యూపీటీ20 వేలంలో గోరఖ్‌పూర్ లయన్స్ రూ. 7 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ ఇప్పుడు యూపీసీఎ నిర్ణయంతో గోరఖ్‌పూర్ దయాల్ సేవలను కోల్పోయే అవకాశముంది. అయితే గోరఖ్‌పూర్ లయన్స్ యాజమాన్యానికి ఇంకా యూపీసీఎ నుంచి దయాల్‌కు సంబంధించి ఎటువంటి ఆదేశాలు అందలేని దైనక్ జాగరణ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది.అంతేకాకుండా త్వరలోనే యూపీసీఎ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని మరిన్ని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇక ఈ ఏడాది యూపీ టీ20 లీగ్ ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: సాయి సుదర్శన్‌కు మరోసారి మొండిచేయి.. ప్లాన్ ఏంటి? -
రాజీవ్ శుక్లా అవుట్!
లక్నో: లోధా కమిటీ సిఫారుసులను అమలు చేసేందుకు ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(యూపీసీఏ) నడుంబిగించింది. దీనిలో భాగంగా యూపీసీఏ సెక్రటరీ పదవికి రాజీవ్ శుక్లా తాజాగా రాజీనామా చేశారు. దాంతో పాటు మరో ఐదుగురు ఆఫీస్ బేరర్లు తమ తమ పదవులకు రాజీనామా చేస్తూ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వీరిలో రాజీవ్ శుక్లా, బీసీ జైన్(అకౌంట్స్ జాయింట్ సెక్రటరీ)లు ఇప్పటికే తొమ్మిదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకోవడంతోవారి హోదాల నుంచి వైదొలగాల్సి వచ్చింది. మరొకవైపు 70 ఏళ్ల పైబడిన నలుగురు యూపీసీఏ సభ్యులు తమ పదవులకు గుడ్ బై చెప్పారు. ఇలా తప్పుకున్న వారిలో కేఎన్ టాండన్(ట్రెజరర్), సుహబ్ అహ్మద్(జాయింట్ సెక్రటరీ)లతో పాటు ఉపాధ్యక్షులు తాహిర్ హసన్, మదన్ మోహన్ మిశ్రాలు తమ పదవులకు వీడ్కోలు చెప్పారు. ఈ మేరకు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన లోధా సిఫారుసులను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పలువురు యూపీసీఏ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. తదుపరి ఏజీఎం(వార్షిక సర్వసభ్య సమావేశం)లో కొత్త ఆఫీస్ బేరర్లను ఎన్నుకోనున్నట్లు శుక్లా స్పష్టం చేశారు. -
‘లోధా’ ప్రభావం షురూ
కాన్పూర్: లోధా కమిటీ సిఫారసులను బీసీసీఐ అమలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన మరుసటి రోజే ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘం (యూపీసీఏ)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంఘంలో 70 ఏళ్లకు పైబడిన ఐదుగురు డెరైక్టర్లు మంగళవారం తమ పదవులకు రాజీనామా సమర్పించారు. వీరితో పాటు కీలక పదవిలో ఉన్న యూపీసీఏ కోశాధికారి కేఎన్ టాండన్ (80) కూడా త్వరలోనే తప్పుకోనున్నట్లు సమాచారం మరో వైపు ఢిల్లీ క్రికెట్ సంఘం కూడా లోధా సిఫారసుల ప్రకారం ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో మార్పులు తీసుకు రానున్నట్లు ప్రకటించింది.