
ఆసియాకప్-2025కు ముందు టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్ విధ్వంసం సృష్టించాడు. యూపీ టీ20 లీగ్-2025లో మీరట్ మావెరిక్స్ సారథ్యం వహించిన రింకూ సింగ్.. గురువారం గౌర్ గోరఖ్ పూర్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.
168 పరుగుల లక్ష్య చేధనలో ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రింకూ పత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. లక్నోలని ఎకానా స్టేడియంలో రింకూ బౌండరీల వర్షం కురిపించాడు. ఓటమి ఖాయమైన చోట ఈ లెఫ్ట్ హ్యాండర్ తన తుపాన్ ఇన్నింగ్స్‌తో అద్భుతం చేశాడు.
కేవలం 48 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సింగ్.. 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 108 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. దీంతో 168 పరుగుల టార్గెట్‌ను మీరట్ మావెరిక్స్ 4 వికెట్లు కోల్పోయి చేధించింది. గోరఖ్ పూర్ బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, అనికిత్ చౌదరీ, ఏ రెహమన్, విజయ్ యాదవ్ తలా వికెట్ సాధించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన గోరఖ్ పూర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. గోరఖ్‌పూర్ కెప్టెన్ ధ్రువ్ జురెల్(38) టాప్ స్కోరర్‌గా నిలవగా.. నిశాంత్ కుష్వాహా(37), శివమ్ శర్మ(25) రాణించారు. మీరట్ బౌలర్లలో విశాల్ చౌదరి, విజయ్ కుమార్ తలా మూడు వికెట్లు పగొట్టగా.. జీసన్ అన్సారీ రెండు వికెట్లను తీశాడు.
ఇక ఇది ఇలా ఉండగా.. ఆసియాకప్‌నకు ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో రింకూ సింగ్‌కు చోటు దక్కింది. అయితే ఫామ్‌లేనప్పటికి రింకూకు ఛాన్స్ ఇవ్వడాన్ని చాలా మంది తప్పుబట్టారు. కానీ ఇప్పుడు తనపై విమర్శలు చేసిన వారికి రింకూ బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు.
ఆసియా కప్ టీ20-2025 టోర్నమెంట్‌కు భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.
చదవండి: UPT20: రింకూ సింగ్ విధ్వంసకర సెంచరీ.. 8 సిక్స్‌లతో వీర వీహారం! వీడియో
Chasing a target of 168, Rinku walks in at 38-4. Scores unbeaten 108 off 48. Wins the game in the 19th over. 🤯
The One. The Only. RINKU SINGH! 🦁 💜
pic.twitter.com/YCjQcLMcaH— KolkataKnightRiders (@KKRiders) August 21, 2025