
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌కు ముందు టీమిండియా స్టార్ రింకూ సింగ్ (Rinku Singh) సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. యూపీ టీ20 లీగ్‌లో మీరట్ మావెరిక్స్ (Meerut Mavericks)కు ప్రాతినిథ్య వహిస్తున్న అతడు.. ఈ టోర్నీలో నాలుగో లీడింగ్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు. ఇప్పటికి పది మ్యాచ్‌లలో కలిపి రింకూ 332 పరుగులు సాధించాడు. అతడి స్ట్రైక్‌రేటు 179.46.
ఇదే జోరును రింకూ కొనసాగిస్తే ఆసియా కప్ భారత తుదిజట్టులోనూ చోటు సంపాదించుకోవడం ఖాయం. కాగా సెప్టెంబరు 9- 28 వరకు యూఏఈ వేదికగా ఈసారి టీ20 ఫార్మాట్లో ఈ టోర్నీ జరుగనుంది. ఈ నేపథ్యంలో రింకూ సింగ్.. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌తో తనకున్న అనుబంధం గురించి తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాడు.
దుబాయ్‌కు వెళ్లాక గంభీర్ సర్‌తో మాట్లాడతా
తనకు ఆసియా కప్ జట్టులో చోటు దక్కడం గురించి ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఇప్పటి వరకు నేనైతే ఎవరినీ అడుగలేదు. దుబాయ్‌కు వెళ్లిన తర్వాత గంభీర్ సర్‌తో సుదీర్ఘంగా సంభాషిస్తా.

ఇప్పటి వరకు మేము ఈ విషయం గురించి మాట్లాడుకోనేలేదు’’ అని రింకూ సరదాగా బదులిచ్చాడు. అదే విధంగా.. ‘‘ఆయనను కలవడమే కాదు.. ఆయన నుంచి పాఠాలు నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటా.
నాకు గంభీర్ సర్ మద్దతు ఉంది
కెరీర్‌లో నేను ఎదగడానికి ఆయన సహకారం ఎంతగానో ఉంది. జీజీ (గౌతం గంభీర్) సర్ నాకు ఎల్లవేళలా మద్దతుగా నిలిచారు. కేకేఆర్‌తో ఉన్నపుడు తొలి పరిచయంలోనే నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. పుల్ షాట్ల గురించి నాకు సలహాలు ఇచ్చారు.
ఆటగాళ్ల పట్ల ఆయన ఎంతో ప్రేమగా ఉంటారు. ఆయనకు పరిజ్ఞానం ఎక్కువ. బ్యాటింగ్ మెళకువల గురించి ఎంతో చక్కగా వివరిస్తారు. ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో బాగుంటుంది. జీజీ సర్ కోచింగ్‌లో టీమిండియాకు ఆడటం గొప్పగా అనిపిస్తుంది.
అలాంటి లెజెండ్‌తో డ్రెసింగ్‌రూమ్ పంచుకోవడం ఓ ప్రత్యేకమైన అనుభూతి’’ అని రింకూ సింగ్ గంభీర్ పట్ల అభిమానాన్ని చాటుకున్నాడు. కాగా ఐపీఎల్‌లో కేకేఆర్‌కు రింకూ కీలక ప్లేయర్ కాగా.. గతేడాది గంభీర్ ఆ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించాడు.