
దాయాది పాకిస్తాన్‌కు టీమిండియా మరోసారి తమ స్థాయి ఏమిటో చూపించింది. దూకుడైన ఆటతో ‘చిరకాల ప్రత్యర్థి’కి చెక్‌పెట్టి .. పొట్టి ఫార్మాట్లో మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుంది. కాగా ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా లీగ్ దశలో ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించిన భారత్.. తాజాగా కీలకమైన సూపర్-4 దశలోనూ సత్తా చాటింది.
దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన.. సల్మాన్ ఆఘా బృందాన్ని ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. పాక్‌ను నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులకు కట్టడిచేయగలిగింది.
అభిషేక్- గిల్ ధనాధన్
ఇక లక్ష్య ఛేదనలో టీమిండియా మరోసారి తన మార్కును చూపించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (Abhishek Sharma)- శుబ్‌మన్ గిల్ (Shubman Gill) అద్భుత రీతిలో ఆకట్టుకున్నాడు. అభిషేక్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు బాది 74 పరుగులు చేయగా.. గిల్ 28 బంతుల్లో 47 పరుగులు సాధించాడు.
వీరికి తోడుగా తిలక్ వర్మ (19 బంతుల్లో 30) ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించాడు. ఈ క్రమంలో 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయి టీమిండియా లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో టీ20 ఫార్మాట్లో పదిహేనుసార్ల ముఖాముఖి పోరులో టీమిండియా పాక్‌పై పన్నెండోసారి గెలుపు జెండా ఎగురవేసింది.
దిగ్గజాలు లేకుండానే
ఈసారి ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు లేకుండానే యువ భారత జట్టు పాక్‌ను ఓడించడం విశేషం. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ జట్టు ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.
ఫియర్‌లెస్..
ఇన్‌స్టా స్టోరీలో ‘‘ఫియర్‌లెస్.. ఫియర్‌లెస్.. ఫియర్‌లెస్’’ అంటూ అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్‌లతో పాటు టీమిండియా ఫొటోను గంభీర్ షేర్ చేశాడు. తమకు భయం లేదు.. తిరుగు లేదు అన్నట్లుగా గంభీర్ ప్రత్యర్థి జట్లకు పరోక్షంగా హెచ్చరిక జారీ చేశాడు. ముఖ్యంగా మైదానంలో అతి చేసిన దాయాది పాక్‌కు తనదైన శైలిలో ఇలా కౌంటర్ వేశాడు.