
టీమిండియా స్టార్ బౌలర్, పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాను (Jasprit Bumrah) పాకిస్తాన్ వెటరన్ స్పిన్నర్ నౌమన్ అలీ (Noman Ali) భయపెడుతున్నాడు. తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నౌమన్ బుమ్రాకు అతి సమీపంగా వచ్చాడు.
గత వారం అద్భుత ప్రదర్శన కారణంగా నౌమన్ ఈ వారం ర్యాంకింగ్స్‌లో ఏకంగా నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని, రెండో స్థానానికి ఎగబాకాడు. టాప్ ర్యాంక్‌లో ఉన్న బుమ్రాకు నౌమన్‌కు కేవలం 29 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది.
గత వారం సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో నౌమన్ తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు సహా 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.
39 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన నౌమన్ గత కొంతకాలంగా టెస్ట్‌ల్లో విశేషంగా రాణిస్తున్నాడు. చివరి 5 టెస్ట్‌ల్లో 5 ఐదు వికెట్ల ప్రదర్శనలు సహా 3 పది వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసి అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. కెరీర్‌లో 21 టెస్ట్‌లు ఆడిన నౌమన్ 95 వికెట్లు తీశాడు.
బుమ్రా విషయానికొస్తే.. ఇతను ఈ నెలలో వెస్టిండీస్‌తో ఆడిన రెండు టెస్ట్‌ల్లో పెద్దగా వికెట్లు తీయలేకపోయాడు. తొలి టెస్ట్‌లో 3, రెండో టెస్ట్‌లో 4 వికెట్లు మాత్రమే తీశాడు.
ఈ వారం ర్యాంకింగ్స్‌లో నౌమన్‌తో పాటు మరో బౌలర్ భారీగా లబ్ది పొందాడు. సౌతాఫ్రికాకు చెందిన సెనూరన్ ముత్తుసామి పాక్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 11 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి ఏకంగా 38 స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం అతను 55 స్థానంలో ఉన్నాడు. ఈ రెండు భారీ మార్పులు మినహా ఈ వారం ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. భారత బౌలర్లు సిరాజ్, కుల్దీప్, జడేజా 12, 14, 18 స్థానాల్లో కొనసాగుతున్నారు.
టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. రూట్, బ్రూక్, కేన్ టాప్-3లో కొనసాగుతుండగా.. టీమిండియా ఆటగాళ్లు జైస్వాల్, పంత్, గిల్ 5, 8, 12 స్థానాల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా ఎవరికీ అందనంత ఎత్తులో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.
చదవండి: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ స్పిన్నర్.. 92 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు