చరిత్ర సృష్టించిన పాకిస్తాన్‌ స్పిన్నర్‌.. 92 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు | Asif Afridi Creates 92-Year-Old World Record in Debut Test | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన పాకిస్తాన్‌ స్పిన్నర్‌.. 92 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు

Oct 22 2025 3:42 PM | Updated on Oct 22 2025 4:12 PM

Asif Afridi shatters 92 year-old record, becomes oldest Test debutant to take a fifer

పాకిస్తాన్‌ వెటరన్‌ స్పిన్నర్‌ ఆసిఫ్‌ అఫ్రిది Asif Afridi) అరంగేట్రంలోనే చరిత్ర సృష్టించాడు. రావల్పిండి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో (Pakistan Vs South Africa) ఐదు వికెట్ల ఘనత సాధించిన ఇతను.. టెస్ట్‌ అరంగేట్రంలో ఈ ఘనత సాధించిన అతి పెద్ద వయస్కుడిగా, 92 ఏళ్ల కిందటి (1933) ప్రపంచ రికార్డును (World Record) బద్దలు కొట్టాడు. 

ఈ రికార్డు గతంలో ఇంగ్లండ్‌కు చెందిన ఛార్లెస్‌ మారియట్‌ పేరిట ఉండేది. మారియట్‌ 37 ఏళ్ల 332 రోజుల వయసులో ఫైఫర్‌ సాధించగా.. ఆసిఫ్‌ అఫ్రిది 38 ఏళ్ల 299 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో హసన్‌ అలీకి ప్రత్యామ్నాయంగా వచ్చిన ఆసిఫ్‌ అఫ్రిది అంచనాలకు మించి రాణించి సౌతాఫ్రికాను ఇబ్బంది పెట్టాడు. ట్రిస్టన్‌ స్టబ్స్‌, టోనీ డి జోర్జి, డెవాల్డ్‌ బ్రెవిస్‌, రబాడ లాంటి కీలక వికెట్లు సహా ఆరు వికెట్లు తీశాడు. ఆసిఫ్‌ ఆరేసినా ఈ ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్‌ (404) చేయగలిగింది.

ట్రిస్టన్‌ స్టబ్స్‌ (76), టోనీ డి జోర్జి (55) అర్ద సెంచరీలకు తోడు ఆఖర్లో సెనురన్‌ ముత్తుసామి (89 నాటౌట్‌), రబాడ (71) చెలరేగారు. ఫలితంగా సౌతాఫ్రికా అత్యంత కీలకమైన 71 పరుగుల ఆధిక్యం సాధించింది.

ముత్తుసామి, రబాడ పాక్‌ బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ పదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 98 పరుగులు జోడించారు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ముత్తుసామి చివరి వరుస బ్యాటర్లతో కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పి సౌతాఫ్రికాకు కీలక ఆధిక్యాన్ని అందించాడు. పాక్‌ బౌలర్లలో ఆసిఫ్‌ అఫ్రిది 6, నౌమన్‌ అలీ 2, షాహీన్‌ అఫ్రిది, సాజిద్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 333 పరుగులకు ఆలౌటైంది. అబ్దుల్లా షఫీక్‌ (57), షాన్‌ మసూద్‌ (87), సౌద్‌ షకీల్‌ (66) అర్ద సెంచరీలతో రాణించగా.. సల్మాన్‌ అఘా (45) పర్వాలేదనిపించాడు. కేశవ్‌ మహారాజ్‌ (42.4-5-102-7) అద్బుత ప్రదర్శనతో పాక్‌ పతనాన్ని శాశించాడు. సైమన్‌ హార్మర్‌ 2, రబాడ ఓ వికెట్‌ తీశారు.

కాగా, రెండు టెస్ట్‌లు, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్టు పాక్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో పాక్‌ 93 పరుగుల తేడాతో పర్యాటక జట్టుపై విజయం సాధించింది.

చదవండి: ఆసీస్‌తో రెండో వన్డే.. భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement