పెళ్లిపీటలెక్కనున్న స్టార్‌ స్పిన్నర్‌.. ఎప్పుడంటే? | Kuldeep Yadav To Marry Childhood Friend Vanishka on March 14th | Sakshi
Sakshi News home page

పెళ్లిపీటలెక్కనున్న స్టార్‌ స్పిన్నర్‌.. ఎప్పుడంటే?

Mar 10 2026 3:11 PM | Updated on Mar 10 2026 3:58 PM

Kuldeep Yadav To Marry Childhood Friend Vanishka on March 14th

భారత క్రికెటర్‌ కుల్దీప్‌ యాదవ్‌ త్వరలోనే ఒక ఇంటివాడు కానున్నాడు. మార్చి 14న తన చిన్ననాటి స్నేహితురాలైన వనిష్కను కుల్దీప్‌ వివాహమాడనున్నాడు. కాగా వీరి వివాహం ఉత్తరాఖండ్‌లోని ముసోరిలో ఒక రిసార్ట్‌ వేదికగా జరగనుంది. గతేడాది జూన్‌ 4న లక్నోలోని ఒక హోటల్‌లో వీరి నిశ్చితార్థ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. ఇప్పటికే పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తవ్వగా మార్చి 13న ప్రీ-వెడ్డింగ్‌ జరగనుంది. అయితే వీరి పెళ్లి కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనున్నట్లు సమాచారం. 

ఇక మార్చి 17న లక్నోలోని హోటల్‌ సెంట్రమ్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ జరగనుంది. ఈ వేడుకకు భారత క్రికెటర్లు, బీసీసీఐ బోర్డు సభ్యులు సహా  ఉత్తర్‌ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులు కూడా హాజరు కానున్నారు. అయితే  వాస్తవానికి కుల్దీప్‌ వివాహం గతేడాని నవంబర్‌లోనే జరగాల్సి ఉండగా, టీ20 ప్రపంచకప్‌ జట్టులోకి కుల్దీప్‌ ఎంపిక కావడంతో పెళ్లి వాయిదా పడింది. ఇక కుల్దీప్‌ యాదవ్‌ టీ20 ప్రపంచకప్‌లో కేవలం పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో మాత్రమే ఆడాడు. ఇక భారత క్రికెట్‌ జట్టు ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను అందుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 

చదవండి: 30 ఏళ్ల క్రితమే పుట్టిన దూబే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement