
శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరగాల్సిన లంక ప్రీమియర్ లీగ్‌ను (Lanka Premier League) వాయిదా వేసింది. వచ్చే ఏడాది స్వదేశంలో జరుగనున్న పురుషుల టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup 2026) దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
లీగ్ ముందుగా షెడ్యూలైన సమయాన్ని స్టేడియాల మరమ్మత్తులకు కేటాయించన్నుట్లు తెలిపింది. ప్రేక్షకుల స్టాండ్లు, డ్రెస్సింగ్ రూములు, ట్రైనింగ్ ఏరియాలు, బ్రాడ్‌కాస్ట్ సదుపాయాలు ఆధునీకరించనున్నట్లు వెల్లడించింది. మహిళల వన్డే ప్రపంచకప్ దృష్ట్యా స్టేడియాల మరమ్మత్తులకు బ్రేక్ పడిందని తెలిపింది.
LPL 2025ను మరో సూటబుల్ విండోలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. లీగ్ తదుపరి నిర్వహించబోయే తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.
ముందస్తు షెడూల్య్ ప్రకారం ఈ ఏడాది లంక ప్రీమియర్ లీగ్‌డిసెంబర్ 1-23 మధ్యలో జరగాల్సి ఉండింది. లంక ప్రీమియర్ లీగ్ వాయిదా పడటంతో ఆటగాళ్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. లీగ్ వాయిదా నిర్ణయంతో లంక క్రికెట్ బోర్డు వాణిజ్య పరంగా నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కాగా, ప్రస్తుతం శ్రీలంకలో మహిళల వన్డే ప్రపంచకప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి శ్రీలంక, భారత్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. 2026 పురుషుల టీ20 ప్రపంచకప్‌కు కూడా శ్రీలంక, భారత్ ఆతిథ్యమిస్తున్నాయి.
చదవండి: చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్తాన్.. జింబాబ్వే చారిత్రక విజయం