టీ20 ప్రపంచకప్-2026 భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం ఐసీసీ ఇటీవలే వేదికలను కూడా ఖరారు చేసింది. భారత్‌లో అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాల్లో వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
అదేవిధంగా శ్రీలంకలోని కొలంబో, కాండీలు కూడా ఈ పొట్టి ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే ఈ మెగా టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. సొంతగడ్డపై ఎలాగైనా టైటిల్‌ను నిలబెట్టుకోవాలని పట్టుదలతో మెన్ ఇన్ బ్లూ ఉంది. ఈ మెగా ఈవెంట్‌కు ముందు భారత్ సొంతగడ్డపై సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లలో తలపడనుంది. ఈ సిరీస్‌లను ప్రపంచకప్ టోర్నీకి సన్నాహాకంగా భారత్ ఉపయోగించుకోనుంది.
జైశ్వాల్‌కు నో ఛాన్స్..
ఇక ఇది ఇలా ఉండగా.. ఈ పొట్టి ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే అంచనా వేశాడు. ఈ జట్టులో బ్యాటర్లగా అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్),తిలక్ వర్మ, రింకూ సింగ్‌లకు చోటు దక్కింది.
అదేవిధంగా ఆల్‌రౌండర్లగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్‌లను భోగ్లే ఎంపిక చేశాడు. స్పెషలిస్టు స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు ఉన్నారు. ఇక చివరగా ప్రధాన పేసర్లగా అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాలకు అవకాశం దక్కింది.
అయితే టీ20ల్లో దూకుడుగా ఆడే స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ను మాత్రం భోగ్లే పరిగణలోకి తీసుకోలేదు. జైశ్వాల్ ఇప్పటివరకు భారత తరపున 23 టీ20లలో 164.31 స్ట్రైక్ రేట్‌తో 723 పరుగులు చేశాడు. జైశ్వాల్‌తో పాటు ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని కూడా హర్షా ఎంపిక చేయలేదు. కాగా ఈ టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు జరగనుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 కోసం హర్ష ఎంపిక చేసిన భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, క్వర్‌దీప్ సుందర్, వాషింగ్టన్ చక్రవర్తి, వాషింగ్టన్ చక్రవర్తి, వాషింగ్టన్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా
చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్.. గంభీర్ మాస్టర్ మైండ్! 39 ఏళ్ల తర్వాత?


