టీమిండియా స్టార్ ప్లేయర్ రింకూ సింగ్‌ను టీ20 వరల్డ్‌కప్-2026కు పక్కన పెట్టనున్నారా? అంటే అవునానే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోనే సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టులో రింకూ సింగ్ పేరు లేకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.
రింకూ ఔట్.. హార్దిక్ ఇన్
అతడి స్ధానంలో జట్టులోకి స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగొచ్చాడు. ఈ జట్టు సెలక్షన్‌ను బట్టి రింకూ పొట్టి ప్రపంచకప్ ప్రణాళికలలో లేనిట్లు తెలుస్తోంది. రింకూ చివరగా భారత్ తరపన ఆసియాకప్-2025లో ఆడాడు.
పాక్‌తో జరిగిన ఫైనల్లో విన్నింగ్ రన్స్ అతడే కొట్టాడు.
అయితే వాస్తవానికి హార్దిక్ పాండ్యాకు గాయం కాకపోయి ఉంటే రింకూకు తుది జట్టులో దక్కకపోయేది. ఇప్పుడు పాండ్యా గాయం నుంచి కోలుకోని తిరిగి రావడంతో రింకూను పూర్తిగా ప్రధాన జట్టు నుంచే తప్పించారు. బహుశా రింకూ తరుచుగా చెప్పే విధంగా దేవుని ప్లాన్ అయి వుంటుంంది.
గంభీర్ కారణమా?
రింకూ గత కొన్ని టీ20 సిరీస్‌లగా జట్టుతో పాటు ఉన్నప్పటికి తుది జట్టులో మాత్రం పెద్దగా చోటు దక్కలేదు. టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఎక్కువగా ఆల్‌రౌండర్ల మొగ్గు చూపడంతో రింకూ చాలా మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితమయ్యాడు. అతడికి బదులుగా వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబేలకు ప్లేయింగ్ ఎలెవన్‌లో టీమ్ మెనెజ్‌మెంట్ చోటు కల్పిస్తోంది.
అతడు ఆస్ట్రేలియా పర్యటనలో జట్టులో ఉన్నప్పటికీ, ఒక్కసారి కూడా బ్యాటింగ్ చేయలేదు. మొన్నటివరకు ముఖ్యమైన 'ఫినిషర్'గా పరిగణించబడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఇప్పుడు ఏకంగా జట్టులోనే లేకుండా పోయాడు. అయితే టీ20 వరల్డ్‌కప్-2026 భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఉపఖండంలో మంచి స్పిన్నర్లు, స్పిన్‌ను ధీటుగా ఎదుర్కొనే బ్యాటర్లు కావాలి.
వాషింగ్టన్, దూబేలు స్పినర్లకు బాగా ఆడగలరు. అంతేకాకుండా వాషింగ్టన్ బంతితో కూడా మ్యాజిక్ చేయగలడు. సుందర్, దూబే ప్రధాన జట్టులో ఉన్నప్పటికి ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం ఇద్దరిలో ఒకరికి చోటు దక్కే అవకాశముంది.
ఎందుకంటే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ రూపంలో ఇద్దరూ స్పిన్నర్లు ఎలాగానూ తుది జట్టులో ఉంటారు. బహుశా అందుకే రింకూను టీ20 ప్రపంచకప్ సెటాప్ నుంచి తప్పించండొచ్చు. అంతే తప్ప రింకూపై వేటు వెనక మరే ఏ ఇతర కారణం లేకపోవచ్చని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్- ఫిట్‌నెస్‌కు లోబడి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్
🏏తొలి టీ20: డిసెంబరు 9- కటక్, ఒడిశా
🏏రెండో టీ20: డిసెంబరు 11- ముల్లన్‌పూర్, చండీగఢ్
🏏మూడో టీ20: డిసెంబరు 14- ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్
🏏నాలుగో టీ20: డిసెంబరు 17- లక్నో, ఉత్తరప్రదేశ్
🏏ఐదో టీ20: డిసెంబరు 19- అహ్మదాబాద్, గుజరాత్.
చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్


