
టీమిండియా టీ20 స్పెషలిస్ట్ రింకూ సింగ్‌లో కొత్త కోణం బయటపడింది. ఈ విధ్వంసకర మిడిలార్డర్ బ్యాటర్.. స్వరాష్ట్రంలో జరుగుతున్న యూపీ టీ20 లీగ్‌లో బౌలర్ అవతారమెత్తాడు. అవతారమెత్తడమే కాకుండా ఈ విభాగంలోనూ సత్తా చాటాడు.
ఈ లీగ్‌లో మీరట్ మెవరిక్స్‌కు ఆడుతున్న రింకూ.. ఇవాళ (ఆగస్ట్ 18) కాన్పూర్ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 ఓవర్లు స్పిన్ బౌలింగ్ వేసి ఆదర్శ్ సింగ్ అనే బ్యాటర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ వికెట్ తీశాక రింకూ తీవ్ర ఉద్వేగానికి లోనై గర్జించసాగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.
King Rinku @rinkusingh235 rattles the stumps on his first ball! The Captain announces his arrival. #UPT20League #ANAXUPT20League #KhiladiYahanBantaHai #MMvsKS pic.twitter.com/mLwjJWVRSw
— UP T20 League (@t20uttarpradesh) August 17, 2025
రింకూలోని బౌలింగ్ నైపుణ్యాన్ని చూసి టీమిండియా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత జట్టుకు మరో ఆల్‌రౌండర్ దొరికాడంటూ సంబరపడిపోతున్నారు.
కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం బ్యాటింగ్‌నే నమ్ముకుంటే టీమిండియాలో చోటు దక్కడం కష్టంగా మారింది. ఆటగాళ్లంతా అదనంగా మరో విభాగంలో (బ్యాటర్లైతే బౌలింగ్ లేదా వికెట్‌కీపింగ్, బౌలర్లైతే బ్యాటింగ్) సత్తా చాటితేనే ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కే అవకాశం ఉంది.
ఈ విషయాన్ని రింకూ గ్రహించినట్లున్నాడు. కేవలం బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తే సరిపోదు, అదనంగా మరో టాలెంట్‌ను జోడించుకోవాలని భావించి బంతి పట్టాడు. ఈ క్రమంలో తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించాడు. ఆసియా కప్ జట్టులో చోటు ప్రశ్నార్థకమైన వేల రింకూ తనలోని బౌలింగ్ టాలెంట్‌ను బయటికి తీసి సెలెక్టర్లను ఇంప్రెస్ చేశాడు.
బౌలర్‌గా రాణించినా ఆసియా కప్ జట్టులో రింకూకు చోటు దక్కుతుందని చెప్పలేని పరిస్థితి. ఖండాంతర టోర్నీకి ముందు 15 బెర్త్‌ల కోసం 20 మంది పోటీపడుతున్నారు. లోయరార్డర్‌లో ఓ బెర్త్ కోసం రింకూ సింగ్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. రింకూతో పోలిస్తే రియాన్ పరాగ్, సుందర్ మెరుగైన బౌలర్లు. వారితో పోటీలో రింకూ ఏమేరకు నెగ్గుకొస్తాడో చూడాలి.
మ్యాచ్ విషయానికొస్తే.. రింకూ జట్టు మీరట్ కార్పూర్ జట్టుపై 86 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్.. మాధవ్ కౌశిక్ (31 బంతుల్లో 95) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఈ ఇన్నింగ్స్‌లో రింకూకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అనంతరం ఛేదనలో కాన్పూర్ జట్టు తడబడింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది.