హ్యూమన్ మొబైల్ డివైసెస్ (HMD) భారతదేశంలో కొత్త 4G ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్ 'HMD టచ్ 4G'ను లాంచ్ చేసింది.
ఈ HMD టచ్ 4G మొబైల్ ధర రూ. 3999 మాత్రమే. 2025 అక్టోబర్ 9 నుంచి రిటైల్ దుకాణాలు, ప్రధాన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంటుంది.
HMD టచ్ 4G స్మార్ట్‌ఫోన్ 3.2 ఇంచెస్ టచ్ డిస్ప్లే, క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ పొందుతుంది. వీడియో కాలింగ్ ఫీచర్ కూడా ఉంది.
డేటా షేరింగ్ కోసం Wi-Fi & Wi-Fi హాట్‌స్పాట్ కార్యాచరణకు కూడా సపోర్ట్ చేస్తుంది.
2 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా ఇందులో ఉన్నాయి. ఇందులో 2000 mAh బ్యాటరీ ఉంటుంది.


