
త్వరలో భారత్‌తో జరుగబోయే టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన ఆస్ట్రేలియా జట్టులో (తొలి రెండు మ్యాచ్‌లు) విధ్వంకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు (Glenn Maxwell) చోటు దక్కని విషయం తెలిసిందే. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ సందర్భంగా గాయపడటంతో మ్యాక్సీని ఎంపిక చేయలేదు. గాయం తీవ్రతగా అధికంగా ఉండటంతో మ్యాక్స్‌వెల్ ఈ సిరీస్ మొత్తానికే దూరమవుతాడనే ప్రచారం జరిగింది.
మ్యాక్స్‌వెల్ లాంటి ప్రమాదకర ఆటగాడు లేకపోవడం ఈ సిరీస్‌లో తమ విజయావకాశాలను మెరుగుపరుస్తుందని టీమిండియా భావించింది. అయితే తాజాగా మ్యాక్సీ చేసిన ఓ ప్రకటన టీమిండియా ధీమాను దెబ్బతీసేలా కనిపిస్తుంది.
చివరి మూడు మ్యాచ్‌లకు తాను సిద్దమంటూ మ్యాక్సీ సంకేతాలు పంపాడు. ఒకవేళ ఇదే జరిగితే టీమిండియా విజయావకాశాలు తప్పక ప్రభావితమవుతాయి. ఇటీవలే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన మ్యాక్సీ పూర్తిగా పొట్టి ఫార్మాట్‌పైనే ఫోకస్ పెట్టాడు. భారత్‌తో సిరీస్‌లో అతను చెలరేగే అవకాశం ఉంది. చివరి మూడు మ్యాచ్‌లకు అందుబాటులోకి వస్తే చేయాల్సిన డ్యామేజ్ చేస్తాడు.
ఈఎస్‌పీఎన్ కథనం ప్రకారం.. గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న మ్యాక్సీ భారత్‌తో మూడో వన్డే సమయానికి పూర్తిగా కోలుకుంటాడు. శస్త్ర చికిత్సకు ముందు డాక్టర్లు అతనికి రెండు ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి.. సహజంగా కోలుకోవాలంటే భారత్‌తో సిరీస్ మొత్తానికే దూరం కావాలి.
ఒకవేళ పాక్షికంగా అయినా ఆ సిరీస్‌లో పాల్గొనాలనుకుంటే శస్త్ర చికిత్సకు వెళ్లాలి. దీంట్లో మ్యాక్సీ రెండో ఆప్షన్‌ను చూస్ చేసుకొని శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. మరికొద్ది రోజుల్లో అతను పూర్తి ఫిట్‌గా ఉంటాడు.
కాగా, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు ప్రాక్టీస్ సమయంలో మిచెల్ ఓవెన్ కొట్టిన బలమైన షాట్ కారణంగా మ్యాక్స్‌వెల్ చేతికి తీవ్ర గాయమైంది. దీంతో అతను ఆ సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు.
ఇకపై అలాంటి వారికి బౌలింగ్ చేయను.. మ్యాక్సీ
మిచెల్ ఓవెన్ కొట్టిన బలమైన షాట్ కారణంగా తీవ్ర గాయానికి గురైన మ్యాక్స్‌వెల్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇకపై ప్రాక్టీస్ సమయంలో స్టోయినిస్, టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్ లాంటి హిట్టర్లకు బౌలింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
భారత్‌తో తొలి రెండు టీ20లకు ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నేమన్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, అడమ్ జాంపా
టీ20 సిరీస్ షెడ్యూల్
తొలి టీ20- అక్టోబర్ 29 (కాన్‌బెర్రా)
రెండో టీ20- అక్టోబర్ 31 (మెల్‌బోర్న్)
మూడో టీ20- నవంబర్ 2 (హోబర్ట్)
నాలుగో టీ20- నవంబర్ 6 (గోల్డ్ కోస్ట్)
ఐదో టీ20- నవంబర్ 8 (బ్రిస్బేన్)
చదవండి: విండీస్‌తో రెండో టెస్ట్‌కు భారత తుది జట్టు ఇదే.. యువ ఆటగాడికి వార్నింగ్..!