సంజయ్‌ బంగర్‌ కూతురు సంచలన ప్రకటన | Anaya Bangar Announces 2027 Women’s Cricket Return And Challenging ICC Eligibility Rules, Watch Video Went Viral | Sakshi
Sakshi News home page

మాజీ క్రికెటర్‌ సంజయ్‌ బంగర్‌ కూతురు సంచలన ప్రకటన

Aug 19 2026 10:52 AM | Updated on Aug 19 2026 11:59 AM

Anaya Bangar-Announced-Come-Back-Women Elite Cricket In 2027

Photo Credit: Twitter

భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కూతురు (ట్రాన్స్‌జెండర్‌) అనయ బంగర్ మరోసారి వార్తల్లో నిలిచింది. త్వరలో మహిళల క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వడం​ ద్వారా కొత్త చాప్టర్‌ను ప్రారంభించనున్నట్లు ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించింది. ‘మీ అందరికీ ఒక శుభవార్త. నేను 2027లో మహిళల ఎలైట్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాను. దీని గురించి చాలా విషయాలు పంచుకోవాలనుకున్నా. కానీ ఇప్పుడు చెప్పలేను. నాకు ఆ సంస్థ నుంచి అనుమతి వచ్చిందన్న విషయం మాత్రం స్పష్టం చేయగలను.’ అని చెప్పుకొచ్చింది.

ట్రాన్స్‌జెండర్లను ఉమెన్స్ క్రికెట్‌లోకి అనుమంతించేది లేదంటూ వన్డే వరల్డ్ కప్ 2023 సమయంలోనే ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే ఐసీసీ నిర్ణయాన్ని అనయ బంగర్ సవాల్ చేయడం సంచలనంగా మారింది. ట్రాన్స్‌జెండర్లకు మహిళల క్రికెట్‌లో ఆడే హక్కు ఎందుకు ఉండదో చెప్పాలని ఐసీసీని ప్రశ్నించింది. 

అంతేకాదు లింగమార్పిడి తర్వాత మహిళా క్రికెటర్లతో సమానంగా తన శారీరక స్థితి ఉందని పేర్కొన్న అనన్య బంగర్‌, తన రిపోర్టు‍ల్లో మహిళా క్రికెటర్లకు ఉండే కండబలం, గ్లూకోస్, ఆక్సిజన్ లెవల్స్.. తనకు అలానే ఉన్నాయని నిరూపించుకుంటానని సవాల్‌ చేస్తూ బీసీసీఐ, ఐసీసీకి  లేఖలు రాసింది. 

ఈ నేపథ్యంలోనే అనయ బంగర్ మాంచెస్టర్ యూనివర్సిటీకి చెందిన ఆసుపత్రిలో చేయించుకున్న అదనపు రక్త పరీక్షలు, శస్త్ర చికిత్స వివరాలు సహా వైద్య, శారీరక సమాచారాన్ని ఒక సంస్థ (పేరు చెప్పలేని) పరిశీలించింది. ‘అనయ బంగర్ రిపోర్ట్స్‌ను సుశితంగా పరిశీలించాం. ట్రాన్స్‌జెండర్ అయినప్పటికీ, మహిళలతో సమానంగా శారీరక స్థితి ఉండడంతో అనయకు మహిళల క్రికెట్ ఆడేందుకు అనుమతి ఇవ్వాల్సిందే’ అని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.

అయితే అనయ బంగర్ తాను మహిళల ఎలైట్ క్రికెట్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించినప్పటికీ, భారత మహిళల జట్టుకు ఆడడం మాత్రం క‌ష్టమే. క్రికెట్‌ ఆడేందుకు ట్రాన్స్‌జెండర్లకు అనుమతి లేదనే ఐసీసీ నిబంధనలే ఇందుకు కారణం. పురుష దశ దాటిన తర్వాత లింగ మార్పిడి చేసుకున్న ట్రాన్స్‌జెండర్లు అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో పాల్గొనేందుకు అర్హులు కారు అని ఐసీసీ పేర్కొంది. 

ఇక అనయ తండ్రి సంజయ్ బంగర్ టీమిండియా తరఫున 12 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. 2014 నుంచి 2019 వరకు సంజయ్‌ బంగర్‌ టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. సంజయ్‌ బంగర్‌ కుమారుడు ఆర్యన్‌ తన కుటుంబం మద్దతుతో లింగ మార్పిడి ఆపరేషన్‌ చేయించుకొని అమ్మాయిగా మారాడు. హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (HRT), జెండర్-అఫర్మింగ్ సర్జరీ పూర్తి చేసుకుని అనయా బంగర్‌గా గుర్తింపు పొందింది.

Read:  జ‌డ్డూ చ‌ర్య‌పై గంభీర్ అస‌హ‌నం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement