కెప్టెన్‌గా రుతురాజ్‌.. మ్యాచ్ టైమింగ్స్‌, లైవ్ స్ట్రీమింగ్ ఎక్క‌డంటే? | Ruturaj-Captain-Timings-Live-Streaming-INDA-Vs AUSA-Unofficial ODI Series | Sakshi
Sakshi News home page

IND A Vs AUS A: కెప్టెన్‌గా రుతురాజ్‌.. మ్యాచ్ టైమింగ్స్‌, లైవ్ స్ట్రీమింగ్ ఎక్క‌డంటే?

Oct 4 2026 8:23 PM | Updated on Oct 4 2026 8:25 PM

Ruturaj-Captain-Timings-Live-Streaming-INDA-Vs AUSA-Unofficial ODI Series

Photo Credit: BCCI Twitter

ఆస్ట్రేలియా-ఎ జ‌ట్టు భార‌త్‌లో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఇరుజ‌ట్ల మ‌ధ్య రెండు మ్యాచ్‌ల అన‌ధికారిక టెస్టు సిరీస్ ముగిసిన సంగ‌తి తెలిసిందే. అక్టోబ‌ర్ 6, 9, 11 మ‌ధ్య మూడు మ్యాచ్‌ల అన‌ధికారిక వ‌న్డే సిరీస్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో మ్యాచ్‌ల‌కు సంబంధించి టైమింగ్స్‌, లైవ్ స్ట్రీమింగ్ వివ‌రాల‌ను బీసీసీఐ వెల్ల‌డించింది. 

తొలి వ‌న్డే డే నైట్‌లో జ‌ర‌గ‌నుండ‌గా, మిగిలిన రెండు మ్యాచ్‌లు డే ఫార్మాట్‌లో జ‌ర‌గ‌నున్నాయి. అక్టోబ‌ర్ 6న జ‌ర‌గ‌నున్న తొలి వ‌న్డే మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు ప్రారంభం కానుండ‌గా, మిగ‌తా రెండు వ‌న్డేలు ఉద‌యం 9 గంట‌ల‌కు ప్రారంభం కానున్నాయి. మ్యాచ్‌ల‌న్నీ పాండిచ్చేరి వేదిక‌గా జ‌ర‌గ‌నుండ‌గా, హాట్ స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది.

మ్యాచ్‌ల‌ టైమింగ్స్ వివ‌రాలు..
👉అక్టోబ‌ర్ 6న‌- తొలి అన‌ధికారిక‌ వ‌న్డే- మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి
👉అక్టోబ‌ర్ 9న‌- రెండో అన‌ధికారిక వ‌న్డే- ఉద‌యం 9 గంట‌ల నుంచి
👉అక్టోబ‌ర్ 11న‌- మూడో అన‌ధికారిక వ‌న్డే- ఉద‌యం 9 గంట‌ల నుంచి
( మ్యాచ్‌లన్నీ పాండిచ్చేరి వేదికగా.. జియో హాట్‌స్టార్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌)

కెప్టెన్‌గా రుతురాజ్‌
కాగా ఇండియా-ఎ జ‌ట్టును రుతురాజ్ గైక్వాడ్ న‌డిపించ‌నున్నాడు. ప‌డిక్క‌ల్‌, సాయి సుద‌ర్శ‌న్‌, ప్రియాన్ష్ ఆర్య‌, ర‌జ‌త్ ప‌టీదార్‌, ప్ర‌బ్‌సిమ్ర‌న్ సింగ్ వంటి స్టార్ ఆట‌గాళ్లు జ‌ట్టులో ఉండ‌డంతో సిరీస్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక టీమిండియా ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌లో ఆడ‌డం అనుమాన‌మే. 

ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ (సీవోఈ)లో కోలుకుంటున్న పాండ్యా తాజాగా మ‌ళ్లీ గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఫీల్డింగ్ చేస్తున్న స‌మ‌యంలో అత‌డి కుడి మోకాలు కింద భాగంలో గాయ‌మైంద‌ట‌. స్కానింగ్ రిపోర్టుల ఆధారంగా అత‌డికి క‌నీసం మూడు వారాల పాటు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని వైద్యులు సూచించారు. ఈ క్ర‌మంలో ఆస్ట్రేలియా-ఎతో జ‌ర‌గ‌నున్న వ‌న్డే సిరీస్ నుంచి హార్దిక్‌ను తప్పించి అత‌డి స్థానంలో ముంబై ఆల్‌రౌండ‌ర్ సూర్యాన్ష్ షెడ్గెకు చోటు ద‌క్కింది.

ఆసీస్‌తో సిరీస్‌కు భారత-ఎ జట్టు
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ప్రియాన్ష్‌ ఆర్య, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, కుమార్ కుషాగ్రా, నిశాంత్ సింధు, విప్రజ్ నిగమ్, అర్షిన్ కులకర్ణి, అర్షద్ ఖాన్, నమన్ ధీర్, సూర్యాన్ష్‌, ప్రభ్‌సిమ్రన్ సింగ్, గ్రూర్ సింగ్, గుర్జప్‌నీత్ సింగ్, యశ్ ఠాకూర్

ఇదీ చదవండి: డివిలియ‌ర్స్ విధ్వంసం.. విండీస్‌పై సౌతాఫ్రికా భారీ స్కోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement