IND vs AUS: హార్దిక్ పాండ్యా అవుట్!.. అతడికి చోటు ఖాయం!
టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను దురదృష్టం వెంటాడుతోంది. ఇప్పటికే వివిధ గాయాల కారణంగా వరుస సిరీస్‌లకు దూరమైన అతడు.. ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నాడు.ఈ క్రమంలో కోలుకుంటున్న హార్దిక్ పాండ్యాను ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో జరిగే అనధికారిక వన్డే సిరీస్‌కు సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ విషయంలో తొందరపాటు తగదని భావించి స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌ల నుంచి మాత్రం పక్కనపెట్టారు. ఆసీస్‌తో సిరీస్‌కు ఎంపికఇదిలా ఉంటే.. అక్టోబరు 6- 11 మధ్య భారత్- ‘ఎ’- ఆసీస్- ‘ఎ’ జట్ల మధ్య అనధికారిక వన్డే సిరీస్‌కు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా తాజాగా మరోసారి గాయపడటం ఆందోళన రేకెత్తించింది. ప్రస్తుతం అతడు కుడికాలి మోకాలి కింది భాగంలో నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం.మూడు వారాల విశ్రాంతిఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాకు సుమారు మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా దురదృష్టకరం. హార్దిక్ పాండ్యా కుడికాలి మోకాలి కింది భాగంలో గాయం తీవ్రమైనట్లు స్కాన్ రిపోర్టుల్లో తేలింది.అతడికి రెండు- మూడు వారాల పాటు విశ్రాంతి ఇవ్వాలని డాక్టర్లు చెప్పారు. బీసీసీఐ వైద్య బృందానికి నాయకుడైన డాక్టర్ దిన్షా పార్దీవాలా జపాన్ నుంచి తిరిగి రాగానే హార్దిక్ రిపోర్టులు పరిశీలించి.. అతడు ఎప్పుడు బరిలోకి దిగాలనే అంశంపై స్పష్టతనిస్తారు’’ అని తెలిపాయి.హార్దిక్ స్థానంలో అతడే!కాగా వివిధ రకాల గాయాల కారణంగా హార్దిక్ పాండ్యా ఇప్పటికే స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు, ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు దూరమయ్యాడు. తాజాగా స్వదేశంలో అఫ్గాన్‌తో టీ20 సిరీస్, ఆసియా క్రీడలు-2026 టోర్నీకి అందుబాటులో లేకుండా పోయాడు.తాజాగా భారత్- ‘ఎ’ జట్టుకు కూడా హార్దిక్ పాండ్యా దూరమయ్యే పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో యువ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సూర్యాంశ్ షెడ్గే హార్దిక్ స్థానంలో భారత్- ‘ఎ’ జట్టులో చేరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సూర్యాంశ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్నాడు. అక్కడ నెట్స్‌లో చెమటోడుస్తూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇటీవల సూర్యాంశ్ జింబాబ్వే పర్యటన సందర్భంగా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే.చదవండి: ‘నా వికెట్ తాశావు.. సంబరాలు చేసుకో.. కానీ దూషిస్తే సహించను’