ఆసీస్‌తో మూడో వ‌న్డే.. పాపం ప్రియాన్ష్‌ పరుగు తేడాతో! | Padikkal-Fails-Again-Priyansh-Miss-Fifty-IndiaA-Vs AUSA 3rd Unofficial ODI | Sakshi
Sakshi News home page

IND A Vs AUS A: ఆసీస్‌తో మూడో వ‌న్డే.. పాపం ప్రియాన్ష్‌ పరుగు తేడాతో!

Oct 11 2026 10:31 AM | Updated on Oct 11 2026 10:44 AM

Padikkal-Fails-Again-Priyansh-Miss-Fifty-IndiaA-Vs AUSA 3rd Unofficial ODI

Photo Credit: Twitter

పాండిచ్చేరి వేదిక‌గా ఆస్ట్రేలియా-ఎతో జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో ఇండియా-ఎ జ‌ట్టు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. ఓపెన‌ర్లు ప్ర‌బ్‌సిమ్ర‌న్ సింగ్ (39), ప్రియాన్ష్ ఆర్య (49) తొలి వికెట్‌కు శుభారంభం అందించిన‌ప్ప‌టికీ, భారీ స్కోర్లు చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. ఈ ఇద్ద‌రు తొలి వికెట్‌కు 83 ప‌రుగులు జోడించారు. 39 ప‌రుగులు చేసిన ప్ర‌బ్‌సిమ్ర‌న్‌ను బెన్ డ్వార్షుయిస్ పెవిలియ‌న్ చేర్చాడు. 

లంక‌తో టెస్టు సిరీస్‌లో ఆక‌ట్టుకున్న దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ (2) మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. లియామ్ స్కాట్ బౌలింగ్‌లో ముర్ఫేకు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. అంతకముందు జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో అంతగా ఆకట్టుకోని పడిక్కల్‌.. తాజాగా వన్డే సిరీస్‌లోనూ విఫలమవుతూ వస్తున్నాడు. తొలి వన్డేలో డకౌట్‌ అయిన పడిక్కల్‌ రెండో వన్డేలో ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు.

ఇక 49 ప‌రుగుల‌తో మంచి ట‌చ్‌లో క‌నిపించిన ప్రియాన్ష్ ఆర్య బెన్ డ్వార్షుయిస్ బౌలింగ్‌లో పేల‌వ షాట్‌కు య‌త్నించి ల‌చ్లాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో హాఫ్‌ సెంచరీ మిస్‌ చేసుకున్నట్లయింది. దీంతో 83-0తో ప‌టిష్టంగా క‌నిపించిన భార‌త్ 23 ప‌రుగుల వ్య‌వ‌ధిలో మూడు వికెట్లు కోల్పోయింది. 

ప్ర‌స్తుతం 20 ఓవ‌ర్లు ముగిసేస‌రికి భార‌త్ 118 ప‌రుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ రుత‌రాజ్ గైక్వాడ్ (6), సూర్యాంశ్‌ షెడ్గే (4) క్రీజులో ఉన్నారు. రెండో వ‌న్డేలో మెరిసిన రజత్‌ ప‌టీదార్ (3) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్ప‌టికే రెండు వ‌న్డేలు గెలిచిన ఆసీస్ 2-0తో ఆధిక్యంలో ఉంది. క‌నీసం చివ‌రి వ‌న్డేలోనైనా గెలిచి వైట్‌వాష్ నుంచి త‌ప్పించుకోవాల‌ని ఇండియా-ఎ జ‌ట్టు భావిస్తోంది.

ఇక నేడు జ‌రుగుతున్న మూడో వ‌న్డేకు భార‌త్ మూడు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. సాయి సుద‌ర్శ‌న్‌, కుమార్ కుషాగ్ర‌, అర్ష‌ద్ స్థానాల్లో ప్ర‌బ్‌సిమ్ర‌న్‌, ప్రియాన్ష్ ఆర్య‌, గుర్జ‌ప్‌నీత్‌లు జ‌ట్టులోకి వ‌చ్చారు. మ‌రోవైపు ఆస్ట్రేలియా జ‌ట్టు స్పెన్స‌ర్ జాన్స‌న్‌, రిలే మెరిడిత్‌, సామ్ కొన్‌స్టాస్ స్థానాల్లో టాడ్ ముర్ఫే, విల్ స‌ద‌ర్లాండ్‌, మ‌హిల్ బియ‌ర్డ్‌మ‌న్‌లు తుదిజ‌ట్టులోకి వ‌చ్చారు.

ఇండియా-ఎ జ‌ట్టు: ప్రభ్‌సిమ్రాన్ సింగ్(వికెట్‌కీప‌ర్‌), ప్రియాంష్ ఆర్య, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్‌), రజత్ పాటిదార్, నిశాంత్ సింధు, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, అనుకూల్ రాయ్, యశ్ ఠాకూర్, గుర్జప్నీత్ సింగ్

ఆస్ట్రేలియా-ఎ జ‌ట్టు: మిచెల్ ఓవెన్, లియామ్ స్కాట్, జోష్ ఫిలిప్, లాచ్‌లాన్ షా(వికెట్ కీప‌ర్‌), నాథన్ మెక్‌స్వీనీ, నిఖిల్ చౌదరి, విల్ సదర్లాండ్, బెన్ ద్వార్షుయిస్, తన్వీర్ సంఘా, టాడ్ మర్ఫీ(కెప్టెన్‌), మహ్లీ బార్డ్‌మన్

ఇదీ చదవండి: 
భారత్‌తో వన్డే సిరీస్‌.. రెండు జట్లు ప్రకటించిన న్యూజిలాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement