తొలి మ్యాచ్‌కు గిల్ దూరం.. పంజాబ్‌ కెప్టెన్‌ ఎవరంటే? | Shubman Gill To Miss Punjab Ranji Trophy 2026-27 Season Opener Match Vs Assam, Read Story Inside | Sakshi
Sakshi News home page

Ranji Trophy: తొలి మ్యాచ్‌కు గిల్ దూరం.. పంజాబ్‌ కెప్టెన్‌ ఎవరంటే?

Oct 11 2026 8:51 AM | Updated on Oct 11 2026 12:51 PM

Shubman Gill-To-Miss-Punjab opener Match Vs Assam-Ranji Trophy 2026-27

Photo Credit: Twitter

టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ 2026-27 సీజన్ తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. దేశవాళీలో పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గిల్ అస్సాంతో జరగనున్న మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ముగియడంతో కెప్టెన్ గిల్‌తో పాటు కేఎల్ రాహుల్‌, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్‌ సహా ఇతర ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమయ్యారు. 

నవంబర్‌లో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో భారత ఆటగాళ్లకు రంజీ మ్యాచ్‌లు మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది. ఈ నేపథ్యంలోనే కేఎల్ రాహుల్‌, జడేజాలు వారి రాష్ట్ర జట్ల తరఫున ఇవాళ బరిలోకి దిగనున్నారు. కాగా గిల్ గైర్హాజరీకి గల స్పష్టమైన కారణాలను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించలేదు. 

గిల్ అందుబాటులో లేకపోవవడంతో భారత అండర్-19 మాజీ కెప్టెన్ ఉదయ్ సహారన్ ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టుకు సారథ్యం వహిస్తున్నారు. అయితే అక్టోబర్ 18 నుంచి ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్ మధ్య జరగబోయే  రెండో రంజీ మ్యాచ్‌లో మాత్రం గిల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక అంతర్జాతీయ షెడ్యూల్‌లో విరామం దొరికిన ఆటగాళ్లు కనీసం ఒక రంజీ మ్యాచ్‌కైనా ప్రాతినిధ్యం వహించాలని జాతీయ సెలక్షన్ కమిటీ ఆదేశించిన సంగతి తెలిసిందే.

తొలి రోజే 19 మ్యాచ్‌లు ప్రారంభం..
ఇక దేశవాళీ ప్ర‌తిష్టాత్మ‌క రంజీ ట్రోఫీ 2026-27 సీజ‌న్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ తొలి రోజు అన్నీ జట్లూ బరిలోకి దిగుతుండటంతో మొత్తం 19 మ్యాచ్‌లు ప్రారంభం కానుండటం విశేషం. 32 ఎలీట్‌ జట్లను నాలుగు గ్రూప్‌లు ఎ, బి, సి, డి లుగా విభజించగా... మరో 6 టీమ్‌లు ప్లేట్‌ గ్రూప్‌లో ఉన్నాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌గా మైదానంలోకి అడుగు పెట్టనున్న జమ్మూ కశ్మీర్‌ తమ మొదటి మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ మధ్యప్రదేశ్‌తో తలపడనుంది.  

భారత టెస్టు జట్టులో రెగ్యులర్‌ సభ్యులైన కేఎల్‌ రాహుల్‌ (కర్ణాటక), యశస్వి జైస్వాల్‌ (ముంబై), వాషింగ్టన్‌ సుందర్‌ (తమిళనాడు), రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర) టోర్నీ తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగుతూ తమ ఆటకు పదును పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సత్తా చాటిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ (రాజస్థాన్‌), హర్ష్ దూబే (విదర్భ)లాంటి ఆటగాళ్లకు కూడా ఈ పోరు కీలకం కానుంది. టెస్టు తుది జట్టులో స్థానాన్ని ఆశిస్తున్న సర్ఫరాజ్‌ ఖాన్‌ మరోసారి ముంబై తరఫున భారీగా పరుగులు సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. 

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement