ఊత‌ప్ప మెరుపులు వృథా.. సౌతాఫ్రికా చేతిలో భార‌త్ ఓట‌మి | Utappa-Innings-Not Saved-IND-Champions-Lost-4 Wickets Vs SA-Champions | Sakshi
Sakshi News home page

ఊత‌ప్ప మెరుపులు వృథా.. సౌతాఫ్రికా చేతిలో భార‌త్ ఓట‌మి

Oct 11 2026 7:09 AM | Updated on Oct 11 2026 7:19 AM

Utappa-Innings-Not Saved-IND-Champions-Lost-4 Wickets Vs SA-Champions

Photo Credit: Twitter

షార్జా వేదిక‌గా జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డ‌బ్ల్యూసీఎల్-2026) టోర్నీలో ఇండియా చాంపియ‌న్స్ వ‌రుస‌గా రెండో ప‌రాజ‌యం చ‌విచూసింది. శ‌నివారం రాత్రి సౌతాఫ్రికా చాంపియ‌న్స్ 4 వికెట్ల తేడాతో ఇండియా చాంపియ‌న్స్‌పై విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా చాంపియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 196 ప‌రుగులు చేసింది. 

ఓపెన‌ర్ రాబిన్ ఊత‌ప్ప (31 బంతుల్లో 77; 6 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) విధ్వంసం సృష్టించ‌గా, మిడిలార్డ‌ర్‌లో స్టువ‌ర్ట్ బిన్నీ (30 బంతుల్లో 50) అర్థ‌సెంచ‌రీ చేశాడు. ఆఖ‌ర్లో యూస‌ఫ్ ప‌ఠాన్ (24, 2 ఫోర్లు) ధాటిగా ఆడ‌డంతో ఇండియా స్కోరు 190 ప‌రుగులు దాటింది. సౌతాఫ్రికా బౌల‌ర్లలో ఇమ్రాన్ తాహిర్‌, హార్డ‌స్ విజోన్‌, షాన్ వోన్‌బ‌ర్గ్ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. 

అనంత‌రం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా చాంపియ‌న్స్ 18.5 ఓవ‌ర్ల‌లోనే 6 వికెట్లు కోల్పోయి 198 ప‌రుగులు చేసి గెలుపొందింది. రిచ‌ర్డ్ లెవీ (24), డుప్లెసిస్ (20) శుభారంభం ఇవ్వ‌గా, మిడిలార్డ‌ర్‌లో జేపీ డుమిని (66) కీల‌క అర్థ‌సెంచ‌రీతో రాణించ‌గా, కొలిన్ ఇంగ్రామ్ (24 బంతుల్లో 40) మెరుపు ఇన్నింగ్స్‌తో జ‌ట్టును గెలిపించాడు. 

భార‌త బౌల‌ర్ల‌లో పియూష్ చావ్లా రెండు వికెట్లు తీయ‌గా, దావ‌ల్ కుల‌క‌ర్ణి, అభిమ‌న్యు మిథున్, రిషి ధ‌వ‌న్‌, ప‌వ‌న్ నేగి త‌లా ఒక వికెట్ తీశారు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి హ్యాట్రిక్ న‌మోదు చేసిన సౌతాఫ్రికా ప‌ట్టిక‌లో టాప్‌లో ఉండ‌గా.. మూడింటిలో ఒకటి గెలిచి, రెండు ఓడిన ఇండియా చాంపియ‌న్స్ నాలుగో స్థానంలో కొన‌సాగుతుంది.

ఇదీ చ‌ద‌వండి:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement