Photo Credit: Twitter
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌ను చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లుగా అనిపిస్తోందని సెహ్వాగ్ తెలిపాడు. మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడాలనే ఆలోచన కొంతవరకు నా ఆలోచనలాగే ఉందని పేర్కొన్నాడు. శనివారం పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వార్షిక సభ్య సమావేశంలో పాల్గొన్న సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘‘ఆటకు వయసుతో ప్రామాణికం ఉండకూడదు. ఉదాహరణకు అండర్-19 అయితే, మీ వయస్సు 19 ఏళ్ల లోపు ఉండాలి. కానీ మీరు ఐపీఎల్‌లో ఆడినా లేదా భారత్ తరఫున ఆడినా, వయస్సుతో పనేమీ ఉండదు. 37 ఏళ్ల వయసులో కోహ్లీ జాతీయ జట్టుకు ఆడుతున్నాడు.. అలాగే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా ఆడుతున్నాడు. ఇక్కడ వయసు కంటే వారు చేసే ప్రదర్శననే ముఖ్యం.
ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ తన అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. తొలి బంతి నుంచే కసితీరా బాదాలనుకుంటాడు. మరి అతడికి ఎప్పుడు అవకాశం వస్తుంది, భారత్ తరఫున ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడు అన్నదే ముఖ్యం. వయసు విభాగాల క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆటగాళ్ల వయసు పరిగణలోకి తీసుకోవాలి కానీ ఐపీఎల్ లేదా భారత జట్టుకు ఆడిన అనుభవం ఉన్న ఆటగాడికి వయసు కొలమానం కాకూడదు అనేది నా అభిప్రాయం’’ అని చెప్పుకొచ్చాడు.
15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి దూసుకొచ్చిన వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో టీమిండియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే వయసు దృష్ట్యా అతడు ఫామ్‌లో ఉన్నప్పటికీ తుదిజట్టులో అవకాశం కోసం ఎదురుచూడా ల్సిందేనని ఇటీవలే భారత హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు.
దీంతో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైనప్పటికీ వైభవ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పటివరకు 8 టీ20 మ్యాచ్‌లు ఆడిన వైభవ్ 186 స్ట్రైక్ రేట్‌తో 246 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి.
ఇదీ చదవండి:


