breaking news
Punjab Cricket Association
-
కసితీరా బాదిన అభిషేక్.. గిల్‌పై ప్రతీకారం!
భారత వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ టీమిండియా తరఫున ఓపెనింగ్ చేయడంతో పాటు డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం చూశాం. కానీ ప్రస్తుతం ఈ ఇద్దరు పంజాబ్ క్రికెట్ లీగ్‌లో ప్రత్యర్థులుగా మారిపోయారు. షేర్-ఇ- పంజాబ్ టీ20లీగ్‌లో అభిషేక్ శర్మ అమృత్సర్ సూర్మన్స్కు కెప్టెన్‌గా ఉండగా, గిల్ ఫజిల్కా ఫాల్కన్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. సోమవారం రాత్రి ఈ రెండు జట్లు తలపడగా, అభిషేక్ శర్మ బౌలింగ్‌ను గిల్ చితక్కొట్టాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో అభిషేక్ శర్మ బౌలింగ్‌కు రాగా, అప్పటికే గిల్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇక అభిషేక్ బౌలింగ్‌లో తొలి బంతికి సిక్సర్ కొట్టిన గిల్, మూడో బంతిని బౌండరీ, ఐదో బంతిని సిక్సర్‌గా మలిచాడు. దీంతో ఓవర్లో వైడ్ సహా 16 పరుగులు వచ్చాయి. చివరి బంతికి కూడా సిక్సర్ కొట్టి అభిషేక్‌కు సెండాఫ్ ఇవ్వాలనుకున్నప్పటికీ, సీన్ రివర్స్ అయింది. అభిషేక్ వేసిన ఆఖరి బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నంలో గిల్ గాల్లోకి లేపగా, బౌండరీ లైన్ వద్ద ఉన్న నమన్ ధిర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో గిల్ (35 బంతుల్లో 67) ఇన్నింగ్స్‌కు తెరపడింది. గిల్‌తో పాటు ప్రాన్షు ప్రతాప్ (40), సన్వీర్ సింగ్ (40) రాణించడంతో ఫజిల్కా ఫాల్కన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం అమృత్సర్ ఇన్నింగ్స్ సమయంలో తన వంతు రావడంతో అభిషేక్ రెచ్చిపోయాడు. సహజ్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్ ఆరంభించిన అభిషేక్ (15 బంతుల్లోనే 49; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. ఈ దెబ్బకు అమృత్సర్ సూర్మన్స్ 6 ఓవర్లలో 79 పరుగులు చేసింది. అభిషేక్ ఔటైనప్పటికీ, రాహుల్ కుమార్ (35 బంతుల్లో 53 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాచ్‌లో గిల్ (67 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలిచినప్పటికీ, అభిషేక్ (49) సుడిగాలి ఇన్నింగ్స్‌తో టీమిండియా కెప్టెన్‌ను డామినేట్ చేశాడు. ఈ విజయంతో అమృత్సర్ సూర్మన్స్ తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.Abhishek Sharma doing what he does best in the latest round of Sher-E-Punjab T20 League 🔥🔥 pic.twitter.com/UoxZsJxbOn— Cricbuzz (@cricbuzz) September 8, 2026SHUBMAN GILL vs ABHISHEK SHARMA 😍- Incredible battle at Sher-E-Punjab T20 league, The quality of the league. pic.twitter.com/LrTXT8cXgt— Johns. (@CricCrazyJohns) September 8, 2026Read: తిలక్ వర్మ జట్టు నుంచి తీసేస్తే.. శతక్కొట్టి ఘాటు కౌంటర్! -
రిటైర్మెంట్ ప్రకటించిన గిల్ సహచరుడు
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సహచరుడు, పంజాబ్ జట్టు సీనియర్ వికెట్ కీపర్ గితాన్ష్ ఖేరా దేశవాళీ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2017లో గిల్ పంజాబ్ తరఫున లిస్ట్-ఏ క్రికెట్లో అరంగేట్రం చేసిన సమయంలో ఆ జట్టు వికెట్ కీపర్‌గా గితాన్ష్ ఖేరానే ఉన్నాడు. 14 ఏళ్ల పాటు డొమెస్టిక్ క్రికెట్ ఆడినప్పటికీ గితాన్ష్ ఖేరాకు జాతీయ జట్టుకు ఆడే అవకాశం రాలేదు. కాగా గితాన్ష్ ఖేరా గురువారం సాయంత్రం తన ఇన్స్టాగ్రామ్ వేదికగా దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు భావోద్వేగ ప్రకటన చేశాడు. "అందరిలాగే క్రికెట్లో నేను జాతీయ జట్టుకు ఆడాలని కలలు కన్నా. కానీ మన జీవితం ప్లాన్ చేసినట్లుగా ఎప్పుడు ఉండదు. అంతర్జాతీయంగా దేశానికి ఆడాలన్న కల నెరవేరకపోయినప్పటికీ, డొమెస్టిక్ క్రికెట్ ద్వారా ఎంతో మంది స్నేహితులను, లెక్కలేనన్ని జ్ఞాపకాలను సంపాదించుకున్నందుకు గర్వపడుతున్నా. దేశవాళీ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్న తరుణంలో ఆటపై నా ప్రేమ మాత్రం మునుపెన్నడూ లేనంత బలంగా ఉంది" అని రాసుకొచ్చాడు.2004లో అండర్-15 విభాగంలో పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించిన గితాన్ష్ ఖేరా రెండు దశాబ్ధాల్లో యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌తో పాటు శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలతో కలిసి ఆడడం గొప్ప విషయమని పేర్కొన్నాడు. ఇక పంజాబ్ జట్టు తరఫున అన్ని ఫార్మాట్లు కలిపి 100కు పైగా సీనియర్ మ్యాచ్‌లాడే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు.Photo Credit: Instagramజూనియర్ క్రికెటర్‌గా కెరీర్ ఆరంభించిన గితాన్ష్ ఖేరా 2010లో పంజాబ్ సీనియర్ జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. తనకెరీర్లో 56 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన గితాన్ష్ 34 సగటుతో 2,515 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక వికెట్ కీపర్‌గా 165 డిస్మిసల్స్ చేశాడు. ఇక లిస్ట్-ఏ క్రికెట్లో 40 మ్యాచ్‌లాడి 44 సగటుతో 1,017 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలు, మూడు ఫిఫ్టీలున్నాయి. ఇక 11 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన గితాన్ష్ 96 పరుగులు చేశాడు. ఇక వైట్‌బాల్ క్రికెట్లో కీపర్‌గా 81 డిస్మిసల్స్ చేశాడు. గితాన్ష్ చివరిసారిగా జనవరి 2024లో పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.35 ఏళ్ల వయసున్న గితాన్ష్ ఖేరాకు రిటైర్మెంట్ తర్వాత చాలా మార్గాలు ఉన్నాయి. ప్రస్తుతానికి, అతను తన భవిష్యత్తు గురించి అధికారికంగా మాట్లాడకపోయినప్పటికీ, క్రికెట్లో సంబంధాలు కొనసాగించాలనుకుంటే కామెంటేటర్‌గా పనిచేయడం, అంపైర్ లేదా కోచ్‌గా మారడం వంటి అవకాశాలున్నాయి.Read: ‘తులసి వనంలో గంజాయి మొక్క’.. పోలికలు అవసరమా! -
శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ కీలక నిర్ణయం!
టీమిండియా టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ స్థానిక టీ20 లీగ్‌లో ఆడేందుకు అతడు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. గిల్‌తో పాటు టీమిండియా స్టార్లు అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రభ్‌సిమ్రన్ సింగ్.. అదే విధంగా రమణ్‌దీప్ సింగ్ ఈ లీగ్‌లో భాగం కానున్నట్లు తెలుస్తోంది.పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) ... షేర్-ఈ-పంజాబ్ పేరిట తమ సొంత టీ20 లీగ్‌ను నిర్వహించనున్నట్లు ఆదివారం ప్రకటించింది. స్థానిక ఆటగాళ్లను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. చండీగఢ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పాల్గొన్నాడు.ఇదొక చక్కటి ప్లాట్ఫామ్ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘యువ ఆటగాళ్లను తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇదొక చక్కటి ప్లాట్‌ఫామ్. క్రమంగా పంజాబ్ జట్టు, టీమిండియా స్థాయికి ఎదిగేందుకు షేర్-ఈ-పంజాబ్ దోహదం చేస్తుంది. పంజాబ్ ఎల్లప్పుడూ టీమిండియాకు అత్యుత్తమ క్రికెటర్లను అందించింది.ఈ లీగ్ ద్వారా కూడా మరెంతో మంది వెలుగులోకి వస్తారని నమ్ముతున్నాను. మా గ్రామంలో నాన్న క్రికెట్ అకాడమీ నిర్వహించేవారు. అక్కడ ఉచితంగానే కోచింగ్ ఇచ్చేవాళ్లము. ఇప్పటికీ మా నాన్నకి కాస్త సమయం దొరికితే అక్కడికి వెళ్లి పిల్లల ఆటను గమనిస్తారు. క్రికెట్ పట్ల ఆయనకు ఉన్న అంకితభావం అలాంటిది’’ అని శుబ్‌మన్ గిల్ పేర్కొన్నాడు.గిల్, బ్రార్ ఆలస్యంగానైనా..కాగా ఆగష్టు 30 నుంచి సెప్టెంబరు 13 మధ్య షేర్-ఈ-పంజాబ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్ తదితరులు ఈ లీగ్‌కు అందుబాటులో ఉన్నప్పటికీ.. శుబ్‌మన్ గిల్, గుర్నూర్ బ్రార్ మాత్రం కాస్త ఆలస్యంగా తమ జట్లతో చేరే అవకాశం ఉంది. వీరిద్దరు ఆగష్టు 15- 28 వరకు శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌తో బిజీగా ఉండనున్నారు. ఇదిలా ఉంటే.. షేర్-ఈ-పంజాబ్ లీగ్ ఆరంభ ఎడిషన్‌లో ఆరుజట్లు పాల్గొననున్నాయి. అమృత్సర్, ఫజిల్క, జలంధర్, లుథియానా, మొహాలీ, భటిండా టైటిల్ కోసం పోటీపడనున్నాయి.చదవండి: అభిషేక్ శర్మ విధ్వంసం... 91 బంతుల్లో 233 పరుగులు -
పంజాబ్ హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఓపెనర్..
రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌కు ముందు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు హెడ్‌కోచ్‌గా టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్‌ను పీసీఎ నియమించింది. ఈ విషయాన్ని పీసీఎ అధ్యక్షుడు అమర్జీత్ సింగ్ మెహతా ఆధికారికంగా ధ్రువీకరించారు.కాగా పంజాబ్ హెడ్‌కోచ్ పదవికి ఆస్ట్రేలియా మాజీ స్పీడ్ స్టార్ షాన్ టైట్ కూడా ధరఖాస్తు చేశాడు. కానీ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం జాఫర్ వైపే మొగ్గు చూపింది.రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలవడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ క్రమంలోనే జాఫర్‌ను మా జట్టు ప్రధాన కోచ్‌గా నియమించాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాము. జాఫర్ తన అనుభవంతో జట్టును విజయ పథంలో నడిపిస్తాడని ఆశిస్తున్నాము. భారత్ నుంచి అత్యుత్తమ టెస్టు ప్లేయర్లలో జాఫర్ ఒకడు. కాబట్టి అతడిని మా బోర్డులో చేర్చుకున్నామని పీసీఎ అధ్యక్షుడు అమర్జీత్ సింగ్ మెహతా పేర్కొన్నాడు. జాఫర్ గతంలో ఉత్తరాఖండ్, ఒడిశా జట్లకు హెడ్‌కోచ్ పనిచేశాడు. అంతేకాకుండా ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు మెంటార్, బ్యాటింగ్ కోచ్‌గా కూడా జాఫర్ తన సేవలను అందించాడు. -
ముంబై ఇండియన్స్ బ్యాటర్ విధ్వంసం.. ఐదు బంతుల్లో 5 సిక్స్‌లు! వీడియో వైరల్
పంజాబ్ క్రికెట్ ఆసోషియేషన్ ఆధ్వర్యంలో జరగుతున్న షేర్-ఈ-టీ20 T20 కప్‌లో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ రమణదీప్ సింగ్ అదరగొడుతున్నాడు. ఈ టీ20 లీగ్‌లో అగ్రి కింగ్స్ నైట్స్‌కు రమణదీప్ సింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం బీఎల్వీ బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రమణదీప్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్స్‌లు బాదాడు. అగ్రి కింగ్స్ నైట్స్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన క్రిష్ణన్ అలాంగ్ బౌలింగ్‌లో తొలి ఐదు బంతులను రమణదీప్ సిక్స్‌లుగా మలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం 28 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రమణదీప్ 6 సిక్స్‌లు, ఒక ఫోర్ సాయంతో 63 పరుగులు చేశాడు. అయితే రమణదీప్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికి తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో అగ్రి కింగ్స్ నైట్స్ 3 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 195 లక్ష్యంతో బరిలోకి దిగిన అగ్రి కింగ్స్ నైట్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేయగల్గింది. బీఎల్వీ బ్లాస్టర్స్ బౌలర్లలో కెప్టెన్ మయాంక్ మార్కండే, అలాంగ్ తలా మూడు వికెట్లు సాధించి అగ్రి కింగ్స్ నైట్స్‌ను దెబ్బతీశారు. అంతకుముందు బీఎల్వీ బ్లాస్టర్స్.. కువార్ పఠాక్ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. చదవండి: పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. 18 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై pic.twitter.com/Ejq5DmyHrJ — IndiaCricket (@IndiaCrick18158) July 20, 2023 -
భజ్జీ మాటలే నిజమయ్యాయి.. పీసీఏ అధ్యక్ష పదవికి రాజీనామా
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(పీసీఏ)లో అక్రమాలు ఎక్కువయ్యాయంటూ టీమిండియా మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే. బోర్డు సభ్యులు పేర్లు బయటపెట్టకుండా హర్భజన్ చేసిన వ్యాఖ్యలు పంజాబ్ క్రికెట్లో కలకలం రేపింది. పీసీఏ చీఫ్ అడ్వైజర్‌గా ఉన్న భజ్జీ చేసిన వ్యాఖ్యలే తాజాగా నిజమయ్యాయి. పీసీఏ అధ్యక్షుడిగా ఉన్న గుల్జార్ ఇందర్ సింగ్ చహల్ బుధవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశాడు. పీసీఏలో గుల్జార్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. గుల్జార్ సహా అతని బృందం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా మే నెలలో పీసీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన గుల్జార్‌కు ఆ పదవి మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. తనపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు గుల్జార్ చహల్ పేర్కొన్నారు. ఇక హర్భజన్ రాసిన లేఖలో ఏముందంటే.. ''ప్రస్తుత పీసీఏ అధ్యక్షుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నాడని గడిచిన వారం పది రోజులుగా పంజాబ్ క్రికెట్ ప్రేమికులు, స్టేక్ హోల్డర్ల నుంచి పలు ఫిర్యాదులు అందుకుంటున్నా.ఇది పారదర్శకత,క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని నాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఓటింగ్ హక్కులతో దాదాపు 150 మంది సభ్యులను చేర్చుకోవడానికి పీసీఏ తీవ్రంగా ప్రయత్నిస్తుందని తెలుస్తున్నది. ఇది బీసీసీఐ రాజ్యాంగానికి విరుద్ధం. అంతేగాక పీసీఏ మార్గదర్శకాలు, పారదర్శకత ఉల్లంఘన కిందికే వస్తుంది.. ఈ వ్యవహారానికి సంబంధించి ఇదివరకే బీసీసీఐ అంబుడ్స్‌మెన్ కు ఫిర్యాదులు కూడా అందినట్టు తెలుస్తున్నది. పీసీఏలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు తమపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి, అక్రమాలను దాచడానికి కనీసం సాధారణ సమావేశాలకు కూడా పిలవకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వారి స్వప్రయోజనాల కోసం క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌కు భజ్జీ వార్నింగ్.. -
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌కు భజ్జీ వార్నింగ్..
టీమిండియా మాజీ క్రికెటర్.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ హర్భజన్ సింగ్ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(పీసీఏ)కు వార్నింగ్ ఇచ్చాడు. బీసీసీఐ నిబంధనలు ఖాతరు చేయకుండా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ గుల్జారీందర్ చాహల్ అక్రమాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నాడు. అధికారాన్ని గుప్పిట్లో ఉంచుకుని అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించాడు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్.. పంజాబ్, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ లకు గవర్నింగ్ బాడీగా వ్యవహరిస్తున్నది. మాజీ క్రికెటర్, నటుడు గుల్జారీందర్ చాహల్ పీసీఏ చీఫ్ కాగా ఇంద్రజిత్ సింగ్ బింద్రా చైర్మెన్ గా ఉన్నాడు. హర్భజన్ సింగ్ పీసీఏలో చీఫ్ అడ్వైజర్ గా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే భజ్జీ పీసీఏకు బహిరంగ లేఖ రాశాడు.''ప్రస్తుత పీసీఏ అధ్యక్షుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నాడని గడిచిన వారం పది రోజులుగా పంజాబ్ క్రికెట్ ప్రేమికులు, స్టేక్ హోల్డర్ల నుంచి పలు ఫిర్యాదులు అందుకుంటున్నా.ఇది పారదర్శకత,క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని నాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఓటింగ్ హక్కులతో దాదాపు 150 మంది సభ్యులను చేర్చుకోవడానికి పీసీఏ తీవ్రంగా ప్రయత్నిస్తుందని తెలుస్తున్నది. ఇది బీసీసీఐ రాజ్యాంగానికి విరుద్ధం. అంతేగాక పీసీఏ మార్గదర్శకాలు, పారదర్శకత ఉల్లంఘన కిందికే వస్తుంది.. ఈ వ్యవహారానికి సంబంధించి ఇదివరకే బీసీసీఐ అంబుడ్స్‌మెన్ కు ఫిర్యాదులు కూడా అందినట్టు తెలుస్తున్నది. పీసీఏలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు తమపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి, అక్రమాలను దాచడానికి కనీసం సాధారణ సమావేశాలకు కూడా పిలవకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వారి స్వప్రయోజనాల కోసం క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు''అని పేర్కొన్నాడు. చదవండి: '110 శాతం ఫిట్‌గా ఉన్నా.. టీమిండియాతో పోరుకు సిద్ధం' 'అసలు ధోనిలానే లేడు.. ఎవరు తయారు చేశారో కానీ!' -
Ind Vs Aus: యువీ, భజ్జీకి సముచిత గౌరవం.. ఆసీస్‌తో తొలి టీ20కి ముందు..
Ind Vs Aus 1st T20- మొహాలి: భారత క్రికెట్లో తమకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌లను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) సముచిత రీతిలో గౌరవించనుంది. మొహాలి స్టేడియంలో రెండు స్టాండ్లకు ఈ ఇద్దరు ఆటగాళ్ల పేర్లు పెడుతున్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య మంగళవారం తొలి టి20 మ్యాచ్‌కు ముందు ఈ స్టాండ్స్‌ను ఆవిష్కరిస్తారు. యువరాజ్ భారత్ తరఫున 40 టెస్టుల్లో 1,900, 304 వన్డేల్లో 8,701, 58 టి20ల్లో 1,117 పరుగులు చేయడంతో పాటు 148 వికెట్లు కూడా పడగొట్టాడు. హర్భజన్ 103 టెస్టుల్లో 417... 236 వన్డేల్లో 269... 28 టి20ల్లో 25 వికెట్లు పడగొట్టడంతో పాటు మూడు ఫార్మాట్లలో కలిపి 3,569 పరుగులు సాధించాడు. చదవండి: కోహ్లి ప్రత్యామ్నాయ ఓపెనర్: రోహిత్ శర్మ -
పాక్ క్రికెటర్ల ఫొటోలు తొలగింపు
చండీగఢ్: పుల్వామా ఘటన నేపథ్యంలో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) తమ తరఫున నిరసన వ్యక్తం చేసింది. మొహాలి క్రికెట్ స్టేడియంలో ఉన్న 15 మంది పాకిస్తాన్ క్రికెటర్ల ఫొటోలను పీసీఏ తొలగించింది. స్టేడియంలో లోపలి భాగంలో గ్యాలరీలో, రిసెప్షన్ వద్ద, ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ఈ చిత్రాలు ఉన్నాయి. ‘జవాన్ల పై దాడికి సంబంధించి దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు ఉన్నాయి. మేం కూడా దానికి అతీతులం కాదు. చనిపోయిన కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తూ మా వైపు నుంచి ఈ చర్య తీసుకున్నాం’ అని పీసీఏ కోశాధికారి అజయ్ త్యాగి చెప్పారు. తొలగించిన వాటి జాబితాలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో పాటు మియాందాద్, వసీం అక్రమ్, షాహిద్ అఫ్రిది తదితరుల ఫొటోలు ఉన్నాయి. -
మొహాలీలో స్పోర్టింగ్ వికెట్
మొహాలీ: దక్షిణాఫ్రికాతో జరుగబోయే తొలి టెస్టుకు మంచి స్పోర్టింగ్ వికెట్‌ను తయారుచేసినట్టు పంజాబ్ క్రికెట్ సంఘం (పీసీఏ) కార్యదర్శి ఎంపీ పండావ్ తెలిపారు. ప్రారంభంలో పేసర్లు రాణించినా ఆ తర్వాత స్పిన్నర్లు కీలకమవుతారని చెప్పారు. ‘మా శాయశక్తులా మంచి క్రికెటింగ్ వికెట్‌ను రూపొందించేందుకు ప్రయత్నించాం. బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లకు కూడా లాభించేలా ఉంటుంది. పిచ్ అవుట్ ఫీల్డ్ పూర్తి పచ్చికతో ఉంది. కచ్చితంగా ఇక్కడ అభిమానులకు చక్కటి క్రికెట్ వినోదం లభిస్తుంది’ అని పాండోవ్ తెలిపారు. 1న ప్రొటీస్ జట్టు మొహాలీకి చేరుకోనుంది. అదే రోజు ఢిల్లీలో హర్భజన్ వివాహ విందు ఉండడంతో భారత్ ఆటగాళ్లు మర్నాడు రానున్నారు. 5 నుంచి 9 వరకు మ్యాచ్ జరుగుతుంది. అయితే టిక్కెట్ల అమ్మకాలు మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా లేవు. వీటి రేట్లను తగ్గిస్తే టెస్టులను చూసేందుకు ఎక్కువ సంఖ్యలో అభిమానులు వస్తారని పాండోవ్ అభిప్రాయపడ్డారు.


