
పంజాబ్ క్రికెట్ ఆసోషియేషన్ ఆధ్వర్యంలో జరగుతున్న షేర్-ఈ-టీ20 T20 కప్‌లో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ రమణదీప్ సింగ్ అదరగొడుతున్నాడు. ఈ టీ20 లీగ్‌లో అగ్రి కింగ్స్ నైట్స్‌కు రమణదీప్ సింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం బీఎల్‌వీ బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రమణదీప్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు బాదాడు.
అగ్రి కింగ్స్ నైట్స్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన క్రిష్ణన్ అలాంగ్ బౌలింగ్‌లో తొలి ఐదు బంతులను రమణదీప్ సిక్స్‌లుగా మలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం 28 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రమణదీప్ 6 సిక్స్‌లు, ఒక ఫోర్ సాయంతో 63 పరుగులు చేశాడు. అయితే రమణదీప్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికి తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.
ఈ మ్యాచ్‌లో అగ్రి కింగ్స్ నైట్స్ 3 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 195 లక్ష్యంతో బరిలోకి దిగిన అగ్రి కింగ్స్ నైట్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేయగల్గింది. బీఎల్‌వీ బ్లాస్టర్స్ బౌలర్లలో కెప్టెన్ మయాంక్ మార్కండే, అలాంగ్ తలా మూడు వికెట్లు సాధించి అగ్రి కింగ్స్ నైట్స్‌ను దెబ్బతీశారు. అంతకుముందు బీఎల్‌వీ బ్లాస్టర్స్.. కువార్ పఠాక్ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.
చదవండి: పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. 18 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై
— IndiaCricket (@IndiaCrick18158) July 20, 2023