పాకిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ సంచలన నిర్ణయం.. 18 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై

18 year old Pakistan cricketer Ayesha Naseem announces retirement - Sakshi

పాకిస్తాన్‌ మహిళా స్టార్‌ క్రికెటర్‌ ఆయేషా నసీమ్ సంచలన నిర్ణయం నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు ఆయేషా నసీమ్ గురువారం రిటైర్మెంట్‌ ప్రకటించింది. 18 ఏళ్లకే ఆమె క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం గమనార్హం. ఇస్లాం మతంకు అనుగుణంగా మరింత పవిత్రమైన జీవితాన్ని గడపడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపింది.

ఆమె తన నిర్ణయాన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు కూడా తెలియజేసింది. ఆయేషా నసీమ్ 2020లో పాకిస్తాన్‌ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. తన కెరీర్‌లో 33 టీ20లు, 3 వన్డేలు ఆడిన నసీమ్‌.. వరుసగా 369,33 పరుగులు సాధించింది.

ఆయేషా నసీమ్ చివరగా పాకిస్తాన్‌ తరపున ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐర్లాండ్‌పై ఆడింది. అదే విధంగా ఈ ఏడాది జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుపై నసీమ్‌ 45 పరుగులు సాధించింది. ఆమె టీ20 కెరీర్‌లో ఇదే అత్యధిక స్కోర్‌ కావడం విశేషం. ఆయేషా నసీమ్ హిట్టింగ్‌ చేసే సత్తా కూడా ఉంది. అటువంటి ఆయేషా అంతర్జాతీయ  క్రికెట్‌ నుంచి తప్పుకోవడం పాకిస్తాన్‌ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి.
చదవండిఇదేమి ఔట్‌రా అయ్యా.. పాకిస్తాన్‌ ఆటగాళ్లు అంతే! వీడియో వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top