Derbyshire Vs Durham: Haider Ali Stumped Out By Ollie Robinson, Video Viral - Sakshi
Sakshi News home page

ఇదేమి ఔట్‌రా అయ్యా.. పాకిస్తాన్‌ ఆటగాళ్లు అంతే! వీడియో వైరల్‌

Jul 20 2023 4:29 PM | Updated on Jul 20 2023 5:20 PM

Haider Ali's Brainfade Moment Results in Bizarre Dismissal - Sakshi

పాకిస్తాన్‌ ఆటగాడు హైదర్ అలీ టెస్టు క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్పాడు. హైదర్‌ అలీ ప్రస్తుతం ఇంగ్లండ్‌ కౌంటీల్లో బీజీబీజీగా ఉన్నాడు. కౌంటీల్లో డెర్బీషైర్‌ క్రికెట్‌ క్లబ్‌కు హైదర్‌ అలీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే కౌంటీ ఛాంపియన్‌షిప్‌ డివిజన్-2లో భాగంగా డర్హామ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదర్‌ ఊహించని రీతిలో ఔటయ్యాడు.

ఏం జరిగిందంటే?
డెర్బీషైర్‌ ఇన్నింగ్స్‌ 77 ఓవర్‌ వేసిన స్కాట్‌ బోర్త్‌విక్‌ బౌలింగ్‌లో రెండో బంతిని హైదర్ అలీ రివర్స్ స్వీప్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి మిస్స్‌ అయ్యి ప్యాడ్‌కు తాకి వెనుక్కి వెళ్లింది. దీంతో వికెట్‌ కీపర్‌తో పాటు బౌలర్‌ కూడా ఎల్బీకి అప్పీల్‌ చేశారు. కానీ అంపైర్‌ మాత్రం నాటౌట్‌ అని తల ఊపాడు. అయితే హైదర్‌ అలీ మాత్రం కనీసం బంతి ఎక్కడ ఉందో చూసుకోకుండా రన్‌ కోసం ముందుకు వెళ్లిపోయాడు. ఇది గమనించిన వికెట్‌ కీపర్‌ రాబిన్సన్‌ వెంటనే స్ట​ంప్స్‌ను పడగొట్టాడు.

ఈ క్రమంలో ఫీల్డ్‌అంపైర్‌ థర్ఢ్‌ అంపైర్‌కు రీఫర్‌ చేశారు. పలు కోణాల్లో రీప్లేను పరిశీలించిన థర్ఢ్‌ అంపైర్‌ స్టంపౌట్‌గా ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో నెటిజన్లు పలు విధాలగా స్పందిస్తున్నారు. ఓ యూజర్‌ స్పందిస్తూ.. పాకిస్తాన్‌ ఆటగాళ్లు అంతే.. కొంచెం కూడా తెలివుండదు అని కామెంట్‌ చేశారు. ఇక ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో హైదర్‌ అలీ 38 పరుగులు చేశాడు.!
చదవండి: Dravid- Kohli: విండీస్‌తో ప్రత్యేక మ్యాచ్‌.. కోహ్లిపై ద్రవిడ్‌ ప్రశంసల జల్లు! ఆ మూడు గుణాల వల్లే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement