
లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్‌కు టీమిండియా ధీటైన జవాబు ఇచ్చింది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేయగా.. టీమిండియా సైతం సరిగ్గా 387 పరుగులకు ఆలౌటైంది. అయితే మూడో రోజు తొలి సెషన్‌లో ఇంగ్లండ్‌పై భారత్ ఆధిపత్యం చెలాయించింది.
కానీ లంచ్ విరామానికి ముందు పంత్ వికెట్‌ను కోల్పోవడంతో కథ తారుమారైంది. అనవసరంగా రనౌట్ అయ్యి ఇంగ్లండ్‌కు తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. కేఎల్ రాహుల్, పంత్ మధ్య సమన్వయలోపం వల్ల భారత్ వికెట్ కోల్పోవల్సి వచ్చింది.
అయితే లేని పరుగు కోసం పంత్ ప్రయత్నించి రనౌటయ్యాడు అని చాలా మంది విమర్శించారు. కానీ ఈ పూర్తి బాధ్యతను రాహుల్ తీసుకున్నాడు. లంచ్ బ్రేక్‌కు ముందు సెంచరీ సాధించాలనే తన ఆత్రుత అనవసర రనౌట్‌కు అవుట్‌కు దారితీసిందని వెల్లడించాడు.
"ఈ మ్యాచ్‌లో మా ఇద్దరి మధ్య చాలా సంభాషణలు జరిగాయి. వీలైతే లంచ్ విరామానికి ముందే సెంచరీ సాధిస్తానని నేను పంత్‌తో చెప్పాను. బషీర్ లంచ్ బ్రేక్‌కు ముందు చివరి ఓవర్ వేయడంతో సెంచరీ చేయడానికి మంచి అవకాశం భావించాను.
అందుకే పంత్ నాకు సింగిల్ తీసి స్ట్రైక్ ఇవ్వాలని ప్రయత్నించాడు. కానీ దురదృష్టవ శాత్తూ రనౌట్ అయ్యాడు. అయితే ఆ ఓవర్‌లో తొలి బంతికి బౌండరీ బాదే అవకాశముండేది. కానీ నేను మిస్ చేసుకున్నాను. ఆ బంతికి కేవలం సింగిల్ మాత్రమే లభించింది.
దీంతో పంత్ మళ్లీ నన్ను స్ట్రైక్‌లోకి తీసుకురావాలనకున్నాడు. అందుకే క్విక్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో అతడు రనౌట్ అవ్వాల్సి వచ్చింది. ఇది మా ఇద్దరికీ నిరాశ కలిగించింది. కానీ ఏ బ్యాటర్ కూడా ఈ విధంగా ఔట్ అవ్వాలని అనుకోరు. ఏదేమైనా ఆ రనౌట్ మా మూమెంటమ్‌ను దెబ్బతీసింది. ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఇంగ్లండ్ తిరిగి గేమ్‌లోకి వచ్చింది"అని రాహుల్ మూడో రోజు ఆట అనంతరం విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.
ఆ తర్వాత షోయబ్ బషీర్ బౌలింగ్‌లోనే రాహుల్ 177 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేసిఔటయ్యాడు. ఈ కర్ణాటక ఆటగాడు రిషబ్ పంత్‌తో కలిసి నాలగో వికెట్‌కు 140 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్ గడ్డపై రాహుల్ సూపర్ సెంచరీ.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బ్రేక్