IND vs ENG 3rd Test: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా.. వరల్డ్ రికార్డు బ్రేక్‌ | Team India Creates History, Most sixes by a team in an away series | Sakshi
Sakshi News home page

IND vs ENG 3rd Test: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా.. వరల్డ్ రికార్డు బ్రేక్‌

Jul 13 2025 12:50 PM | Updated on Jul 13 2025 1:08 PM

Team India Creates History, Most sixes by a team in an away series

టెస్టు క్రికెట్‌లో టీమిండియా అరుదైన ఘ‌న‌త సాధించింది. విదేశీ గ‌డ్డ‌పై ఒక టెస్టు సిరీస్‌(క‌నీసం 3 మ్యాచ్‌లు)లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన జ‌ట్టుగా భార‌త్ వ‌ర‌ల్డ్ రికార్డు నెల‌కొల్పింది. లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు సిక్స్‌లు బాదిన టీమిండియా.. ఈ అరుదైన ఫీట్‌ను త‌మ పేరిట లిఖించుకుంది. ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌లో భార‌త్ 34 సిక్స‌ర్లు నమోదు చేసింది.

ఇంత‌కుముందు ఈ రికార్డు వెస్టిండీస్, న్యూజిలాండ్ పేరిట సంయుక్తంగా ఉండేది. 1974లో వెస్టిండీస్ జ‌ట్టు భార‌త్‌లో జ‌రిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 32 సిక్స‌ర్లు నమోదు చేసింది. ఆ త‌ర్వాత 2014లో యూఏఈ వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కివీస్ కూడా స‌రిగ్గా 32 సిక్స‌ర్లు కొట్టింది. తాజా మ్యాచ్‌తో కివీస్‌, విండీస్‌ను భార‌త్ అధిగ‌మించింది.

ఇక లార్డ్స్ టెస్టు ఆస‌క్తిక‌రంగా ముందుకు సాగుతోంది. ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసి 387 పరుగులు చేసింది. బదులుగా భారత్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో  చేసి 387 పరుగులే చేయగలిగింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్ల స్కోరు సమం అయింది. నాలుగో రోజు ఆట ఇరు జట్లకు కీలకం కానుంది. భారత బౌలర్లు మెరుగ్గా రాణించి ఇంగ్లండ్‌ను ఆలౌట్‌ చేస్తే మరో విజయం తమ ఖాతాలో వేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.
చదవండి: నా వ‌ల్లే అలా జ‌రిగింది.. పంత్‌ను ఏమి అనొద్దు: కేఎల్‌ రాహుల్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement