
లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేయగా.. టీమిండియా సైతం సరిగ్గా 387 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (177 బంతుల్లో 100; 13 ఫోర్లు) అద్బుతమైన సెంచరీ సాధించాడు.
అతడితో రిషభ్ పంత్ (112 బంతుల్లో 74; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (131 బంతుల్లో 72; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ చెరో 2 వికెట్లు తీశారు.
గిల్-క్రాలీ వాగ్వాదం..
కాగా మూడో రోజు ఆట ఆఖరి ఓవర్‌లో హ్రైడ్రామా చోటు చేసుకుంది. భారత్ ఆలౌటైనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్ ఆరంభించింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారత బౌలింగ్ ఎటాక్‌ను జస్ప్రీత్ బుమ్రా ఆరంభించాడు. మూడో రోజు మరిన్ని ఓవర్లు ఆడేందుకు ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలే,బెన్ డకెట్‌లు ఏమాత్రం ఇష్టపడలేదు.
ఈ క్రమంలో బుమ్రా బౌలింగ్‌కు జాక్ క్రాలే పదేపదే అంతరాయం కలిగించి సమయాన్ని వృథా చేశాడు. మూడో బంతిని బుమ్రా డెలివరీ చేసే సమయంలో క్రాలీ ఒక్కసారిగా పక్కకు తప్పుకొన్నాడు. దీంతో బుమ్రా అసహనానికి లోనయ్యాడు. టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సైతం క్రాలీపై కోపంతో ఊగిపోయాడు.
అతడి దగ్గరకు వెళ్లి వేలు చూపిస్తూ ఆడేందుకు ధైర్యం తెచ్చుకో అన్నట్లు సైగ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఆఖరి బంతి పడేముందు క్రాలీ గాయం పేరిట డ్రామా చేశాడు. ఫిజియె మైదానంలోకి రావడంతో ఆట కాసేపు నిలిచిపోయింది.
ఈ క్రమంలో భారత ఆటగాళ్లు జాక్ క్రాలీని చప్పట్లు కొడుతూ గేలి చేశారు. వెంటనే క్రాలీ కూడా వేలు చూపిస్తూ ఏదో అన్నాడు. ఆఖరికి అంపైర్‌లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా రెండు పరుగులు చేసింది.
Shubman Gill & Co. didn’t come to be played around, 𝙠𝙮𝙪𝙣𝙠𝙞 𝙔𝙚 𝙨𝙚𝙚𝙠𝙝𝙣𝙚 𝙣𝙖𝙝𝙞, 𝙨𝙞𝙠𝙝𝙖𝙣𝙚 𝙖𝙖𝙮𝙚 𝙝𝙖𝙞𝙣!#ENGvIND 👉 3rd TEST, DAY 4 | SUN 13th JULY, 2:30 PM | Streaming on JioHotstar pic.twitter.com/ix13r7vtja
— Star Sports (@StarSportsIndia) July 12, 2025
Always annoying when you can't get another over in before close 🙄 pic.twitter.com/3Goknoe2n5
— England Cricket (@englandcricket) July 12, 2025