
శ్రీ క్షేత్ర ఝర్ని నరసింహ దేవాలయం

తప్పని సరిగా దర్శించుకొనే ఆలయంలో శ్రీ క్షేత్ర ఝర్ని నరసింహ దేవాలయం ఒకటి

నరసింహ ఝర్ని గుహ దేవాలయం అని కూడా పిలువబడే నరసింహ ఆలయం బీదర్ కు దగ్గరలో ఉన్న మంగళ్ పేట్ లో నరసింహ క్షేత్రం వెలసింది.

ఈ క్షేత్ర దర్శనం.. మన దేశంలో ఉన్న అన్నీ ఆలయాల కంటే భిన్నమైనది.. ప్రత్యేకత కలిగి ఉన్నది.

ఈ క్షేత్రం లో ఉండే స్వామిని జల నరసింహుడు అని కూడా పిలుస్తారు.

ఈ ఝరణీ నరసింహ స్వామిని దర్శించుకోవాలంటే… ఒక గుహ లో మనిషి లోతుగా ప్రవహించే నీటిలో నడుచుకుంటూ వెళ్ళాలి.

అలా 600 మీటర్లు లోపలికి నీటిగుండా ప్రయాణం చేస్తే గుడి వస్తుంది.

ఈ ఆలయానికి వెళ్లాలంటే : హైదరాబాద్ నుంచి బీదర్ 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. మూడు గంటల ప్రయాణం. ఇక్కడకు చేరుకోవడానికి బస్సు, రైలు సదుపాయం కూడా కలదు.

ఇంకా ఆలస్యం ఎందుకు..మీరు ఒకసారి వెళ్లి రండి













