breaking news
Narasimha Temple
-
అహోబిలంలో అరాచకం
సాక్షి, నంద్యాల: కోట్లాదిమంది హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రమైన అహోబిలం నరసింహక్షేత్రం ఇప్పుడు అధికార పార్టీ నేత అక్రమార్జనకు అడ్డాగా మారింది. కొబ్బరికాయ నుంచి తలనీలాలు.. చివరికి పార్కింగ్ నుంచి కూడా బీ ట్యాక్స్ రూపంలో పిండేస్తున్నారు. నంద్యాల జిల్లాలో ఉన్న ఈ ఆలయంలో ఏ పని చేయాలన్నా ప్రజాప్రతినిధి భర్తకు కమీషన్ ఇచ్చుకోవాల్సిందేనన్న పరిస్థితి నెలకొంది. టోల్గేట్, తలనీలాల టెండర్, టెంకాయల వేలం పాట, బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే దుకాణాలు.. ఇలా అన్నింటినుంచి ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. తలనీలాల సేకరణకు ఈ ఏడాది మార్చిలో దేవస్థానం అధికారులు టెండర్ పిలిచారు. చాగలమర్రి మండలం గొడిగెనూరు గ్రామానికి చెందిన ఒక మహిళ రూ.1.50 కోట్లకు టెండర్ దక్కించుకున్నారు. ఈ టెండర్ దక్కేలా చేసినందుకు ఆమె బీ ట్యాక్స్ కింద రూ.20 లక్షలు చెల్లించినట్లు తెలిసింది. టెండర్ దక్కించుకున్న తర్వాత పాట మొత్తాన్ని ఆలయానికి చెల్లించాల్సి ఉన్నా.. ఇప్పటివరకు కేవలం రూ.40 లక్షలు మాత్రమే చెల్లించారు. మిగిలిన రూ.1.1 కోట్లలో ఆలయానికి వచ్చేదెంతో, బీ ట్యాక్స్‌కు పోయేదెంతో అన్నది చర్చనీయాంశంగా ఉంది. 2024–25కు సంబంధించి తలనీలాల వేలం పాటనే నిర్వహించలేదు. ఏడాది పాటు పోగైన తలనీలాలను ప్రజాప్రతినిధి భర్త కిలో రూ.3 వేలకు కొని రూ.12 వేలకు విక్రయించారు. సుమారు 700 కిలోల మేర తలనీలాల నుంచి రూ.63 లక్షలు కొల్లగొట్టారు.టోల్గేట్లో నిలువు దోపిడీఅహోబిలం ఆలయానికి వచ్చే ట్రాక్టర్లు, కార్లు, టూరిస్ట్ బస్సుల నుంచి పంచాయతీ అధికారులు టోల్ వసూలు చేస్తారు. ఏటా ఇందుకోసం టెండర్ పిలుస్తారు. ఈ ఏడాది జూన్‌లో టోల్‌గేట్‌కు వేలం పాట నిర్వహించారు. టెండర్లో వేరే వ్యక్తులు ఎవరూ పాల్గొనకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. సొక్కం వంశీకృష్ణ అనే వ్యక్తి రూ.20.31 లక్షలకు టెండర్ దక్కించుకున్నారు. వేలం పూర్తయిన వెంటనే ఈ మొత్తాన్ని చెల్లించాలి. కానీ ఇప్పటివరకు ఈ మొత్తాన్ని పంచాయతీకి చెల్లించలేదు. కానీ అతడు బీ ట్యాక్స్ కింద రూ.65 లక్షలు చెల్లించినట్లు సమాచారం. దీంతో రూ.100 వసూలు చేయాల్సినచోట రూ.200 వసూలు చేస్తూ భక్తులను నిలువుదోపిడీ చేస్తున్నారు. కొబ్బరికాయ రూ.70 ఆలయంలో టెంకాయలు విక్రయించుకునేందుకు అధికారులు గతేడాది టెండర్ పిలిచారు. టెండర్లో ఎవరూ పాల్గొనకుండా చేసి రూ.35 లక్షలకు స్థానిక టీడీపీ నేత దక్కించుకున్నాడు. తనకు టెండర్ దక్కేలా చేసినందుకు బీ ట్యాక్స్ కింద రూ.40 లక్షలు సమర్పించుకున్నాడు. నియోజకవర్గ నేత అండదండలతో ఒక్కో టెంకాయను రూ.70కి విక్రయించి భక్తులను కొల్లగొట్టారు. రూ.35 లక్షలకు టెండర్ దక్కించుకున్న వ్యక్తి ఆలయానికి రూ.20లక్షలు మాత్రమే జమచేశారు. సారా బట్టీలు.. బెల్టుషాపులు అహోబిలానికి ఏడాది పొడవునా దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ కొండల్లో సారా గుప్పుమంటోంది. 24 గంటలు మద్యం అందుబాటులో ఉంటోంది. తాళ్లకుంట కొండల్లో ఆరు, ఏడు బట్టీల్లో సారా కాస్తున్నారు. ఒక్కో బట్టీ నుంచి నియోజకవర్గ నేతకు మామూళ్లు వెళుతున్నాయి. సారాతో పాటు 8 మద్యం బెల్ట్ షాప్‌లు వెలిశాయి. పోతురాజు చెరువు, ఛత్రవట గుట్టల కింద మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ నుంచి రూ.500 కమీషన్ వసూలు చేస్తున్నారు. రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో మట్టిని తరలించి సహజ సంపదను కొల్లగొడుతున్నా అధికారులు స్పందించడం లేదు. -
600 మీటర్ల లోతు నీటి గుహలో ప్రయాణం..నరసింహ స్వామి దర్శనం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
నృసింహుని సన్నిధిలో ‘కాటమరాయుడు’ నిర్మాత
కదిరి అర్బన్ : స్థానిక ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని బుధవారం ‘కాటమరాయుడు’ చిత్ర నిర్మాత శరత్‌మరార్, టీటీడీ మెంబర్ హరిప్రసాద్ దర్శించుకున్నారు. ఈమేరకు ఆలయ పూజారులు, సిబ్బంది వారికి ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో పలువురు పవన్‌కల్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. అనంతరం చిత్రనిర్మాత శరత్‌మరార్ మాట్లాడుతూ దేవుడి ఆశీర్వాదంతో ‘కాటమరాయుడు’ సినిమాను బాగా తీయగలిగామన్నారు. సినిమాకు టైటిట్ కూడా బాగా కుదిరిందని చెప్పారు. అందుకే దేవుడి ఆశీస్సులతో ముందుకెళ్లాలని దర్శించుకునేందుకు వచ్చామన్నారు. సినీనటుడు పవన్‌కల్యాణ్ కూడా త్వరలోనే కదిరి నృసింహున్ని దర్శించుకుంటారని చెప్పారు. అనంతరం పవన్ అభిమానులు నిర్మాతను పూలమాలతో సన్మానించారు. -
నృసింహుని సన్నిధిలో ఎస్పీ దంపతులు
కదిరి అర్బన్ : స్థానిక లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో గురువారం ఎస్పీ రాజశేఖర్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు వారికి ఘనస్వాగతం పలికారు. ఎస్పీ దంపతులకు ప్రసాదాన్ని అందజేశారు. వారి వెంట డీఎస్పీ రామాంజనేయులు, సీఐ శ్రీనివాసులు,ఎస్ఐలు మధుసూదన్‌రెడ్డి, గోపాలుడు, తదితరులు ఉన్నారు. -
జై నారసింహా.. జైజై లక్ష్మీనారసింహా
* మంగళాద్రిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు * ఉత్తరద్వారంలో దర్శనమిచ్చిన శ్రీవారు మంగళగిరి : శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆదివారం స్వామివారు బంగారు గరుడవాహనంపై ఉత్తరద్వారంలో దర్శనమిచ్చారు. శనివారం రాత్రి స్వామి వారు జగన్మోహిని అలంకారంలో పుష్పకవిమానంపై గ్రామోత్సవంతో ప్రారంభమైన వేడుకలు అర్ధరాత్రి ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు తిరువంజనోత్సవం, అభిషకాలు నిర్వహించారు. స్వామివారు బంగారు గరుడవాహనంపై ఉత్తరద్వారంలో కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని శంఖుతీర్ధం స్యీకరించారు. రద్దీ గంటగంటకు పెరగడంతో దైవదర్శనానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టింది. అనంతరం సాయంత్రం శ్రీస్వామివారి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి వారు ఉత్తరద్వార దర్శనం ప్రారం¿¶భమైన వెంటనే ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) స్వామి వారిని దర్శించుకుని శంఖుకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధం స్వీకరించారు. ఆలయ ఈవో మండెపూడి పానకాలరావు ఆలయమర్యాదలతో స్వాగతం పలికి పూజలు చేయించారు. స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖులలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, మోపిదేవి వెంకటరమణ, మురుగుడు హనుమంతరావు, ఇండియా క్రికెట్ సలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కె ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, హైకోర్టు జడ్జి మూర్తి, జిల్లా జడ్జిలు, వివిధ శాఖల అధికారులు స్వామి వారిని దర్శించుకుని శంకుతీర్ధం స్వీకరించారు. ఆలయ అధికారి మండెపూడి పానకలరావు, పాలకవర్గం సభ్యులు ఆలేటి నాగలక్ష్మి, ఊట్ల శ్రీమన్నారాయణ, అనుమోలు సాంబశివరావు, క్రోసూరి శివనాగరాజు, మోరం సాంబశివరావు, పంచుమర్తి ప్రసాద్, ఆర్ శ్రీనివాసరావు, వెనిగళ్ళ ఉమాకాంతంలు వారికి ఆలయమర్యాదలతో స్వాగతం పలకగా అర్చకులు పద్మానాభాచార్యులు తదితరులు పూజలు నిర్వహించారు.


