
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో తలపడేందుకు భారత జట్టు సిద్దమైంది. హెడింగ్లీలో జరిగిన తొలి టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైన టీమిండియా ఎలాగైనా తిరిగి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్టు నాలుగు రోజుల పాటు ప్రాక్టీస్ సెషన్‌లో గిల్ సేన తీవ్రంగా శ్రమించింది.
ఈ క్రమంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగే రెండో టెస్టులో ప్రత్యర్ధికి ధీటైన సమాధానిమివ్వాలని భారత జట్టును రవిశాస్త్రి కోరాడు.
"రెండో టెస్టులో ఎలాగైనా గెలిచి ఇంగ్లండ్‌కు టీమిండియా కౌంటర్ పంచ్ ఇవ్వాలి. ఇది భారత్‌కు చాలా ముఖ్యమైన విషయం. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవకపోతే సిరీస్‌లో వెనకబడుతోంది. తొలి టెస్టులో ఎక్కువ భాగం ఆధిపత్యం చెలాయించినప్పటికి.. ఆఖరి రోజు ఆటలో నిరాశపరచడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. చివరి రోజు ఆటలో భారీ టార్గెట్ చేధించి గెలిచినందుకు ఇంగ్లండ్‌కు కచ్చితంగా క్రెడిట్ దక్కాల్సిందే.
కానీ ఇప్పుడు ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తిరిగి పుంజుకోవాల్సిన అవసరముంది. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా ఆడుతాడో లేదో ఇంకా తెలియదు. కానీ అతడు ఆడాలనే నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్.. ఇందులో గెలిస్తే సిరీస్ సమమవుతోంది.
కాబట్టి ఈ ఒక్క మ్యాచ్‌లో అతడిని ఆడించి మిగితా మ్యాచ్‌లకు విశ్రాంతి ఇస్తే సరిపోతుంది. ఇది ఐదు మ్యాచ్‌ల సిరీస్ కాబట్టి భారత్ తిరిగి కమ్‌బ్యాక్ ఇస్తుందని ఆశిస్తున్నా" అని ఐసీసీ రివ్యూలో శాస్త్రి పేర్కొన్నాడు.
టీమిండియాతో రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్
చదవండి: IND vs ENG: టీమిండియాకు హార్ట్ బ్రేక్.. ఒక్క వికెట్ తేడాతో ఓటమి