Naseem Shah: ఇంగ్లండ్‌ క్రికెటర్లు అదృష్టవంతులు.. కానీ పాక్‌లో అలా కాదు! అయినా!

Pakistan Doesnt Even Have 30 Percent Of Facilities That England Club Cricketers Do Says Naseem Shah - Sakshi

ఇంగ్లండ్‌ క్లబ్‌ క్రికెటర్లకు ఉన్న సౌకర్యాల్లో 30 శాతం కూడా పాకిస్తాన్‌ ఆటగాళ్లకు లేవని ఆ దేశ ఫాస్ట్‌ బౌలర్‌ నసీమ్ షా అన్నాడు. కరాచీ, లాహోర్ వంటి నగరాల్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, అయితే తాను వచ్చిన ప్రదేశంలో క్రికెట్ గ్రౌండ్ కూడా లేదని షా తెలిపాడు. కాగా నసీమ్ షా ప్రస్తుతం జరుగుతోన్న టీ20 బ్లాస్ట్‌లో గ్లౌసెస్టర్‌షైర్ క్లబ్‌ తరఫున ఆడుతున్నాడు.

“ఇంగ్లండ్‌లో క్లబ్ క్రికెటర్లకు అందుబాటులో ఉన్న సౌకర్యాలలో 30 శాతం కూడా మా దేశ ఆటగాళ్లకు లేవు. నేను ఏ స్థాయి నుంచి వచ్చానో నాకు బాగా తెలుసు. నేను టేప్ బాల్‌తో క్రికెట్ ఆడటం ప్రారంభించాను. కానీ ఇంగ్లండ్‌లో క్రికెటర్ల పరిస్థితి మాకంటే పూర్తి భిన్నంగా ఉంది. ఇంగ్లండ్‌ క్రికెటర్లు చాలా అదృష్టవంతులు. వారికి ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఇక మా జట్టులోని చాలా మంది ఆటగాళ్లు కనీస మౌలిక వసతులు  లేని ప్రాంతాల నుంచి వచ్చారు.

లాహోర్, కరాచీ వంటి నగరాల్లో అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి. కానీ నేను ఉన్న చోట కనీసం క్రికెట్‌ గ్రౌండ్‌ కూడా లేదు. అయితే కనీస సౌకర్యాలు లేనప్పటికీ, మా దేశం నుంచి చాలా మంది అద్భుతమైన క్రికెటర్‌లు వస్తున్నారు" అని నసీమ్ షా పేర్కొన్నాడు. నసీమ్ షా పాకిస్తాన్ లోని ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్‌లోని లోయర్‌ డిర్‌ ప్రాంతానికి చెందిన ఆటగాడు. 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో నసీమ్ షా పాకిస్తాన్‌ తరపున 16 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 11 టెస్టులు ఆడిన నసీమ్ షా 26 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: AUS Vs SL 5th ODI: చివరి వన్డేలో ఆసీస్‌ విజయం.. ఆస్ట్రేలియాకు లంక ఫ్యాన్స్‌ కృతజ్ఞతలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top