Mohammad Rizwan : రిజ్వాన్ సింగిల్ హ్యాండ్ క్యాచ్.. వీడియో వైరల్..!

పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతున్నాడు. రిజ్వాన్ ససెక్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో రిజ్వాన్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. డర్హామ్ రెండో ఇన్నింగ్స్‌లో ససెక్స్ స్పిన్నర్ రాలిన్స్ వేసిన బంతిని స్కాట్ బోర్త్‌విక్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు.
అయితే బంతి ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో ఫస్ట్ స్లిప్ ఫీల్డింగ్ చేస్తున్న రిజ్వాన్.. డైవ్ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇరు జట్లు మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది.
చదవండి: Rinku Singh: తొమ్మిదో క్లాస్‌లో చదువు బంద్.. స్వీపర్, ఆటోడ్రైవర్.. ఆ 80 లక్షలు!
This catch from @iMRizwanPak. 🤯 👏 #GOSBTS pic.twitter.com/uOdy7JJ2nr
— Sussex Cricket (@SussexCCC) May 1, 2022