
ఇంగ్లండ్ మహిళలతో జరిగిన ఐదో టీ20లో 5 వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ షెఫాలీ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది.
41 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 75 పరుగులు చేసింది. ఆమెతో పాటు రిచా ఘోష్(24) రాణించాడు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(8), ఫస్ట్ డౌన్ బ్యాటర్ రోడ్రిగ్స్(1), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(15) నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో చార్లీ డీన్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. ఎకిలిస్టోన్ రెండు, స్మిత్, ఆర్లాట్ తలా వికెట్ సాధించారు.
ఓపెనర్ల విధ్వంసం..
అనంతరం 168 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి ఛేదించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు సోఫియా డంక్లీ(46), డేనియల్ వ్యాట్-హాడ్జ్(56) అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరితో పాటు టామీ బ్యూమాంట్(30) రాణించింది.
భారత బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి తలా రెండు వికెట్లు సాధించారు. అయితే ఆఖరి టీ20లో భారత్ ఓటమిపాలైనప్పటికి.. తొలుత మూడు మ్యాచ్‌లు గెలవడంతో సిరీస్‌ను 2-3 తేడాతో ఉమెన్ ఇన్ బ్లూ సొంతం చేసుకుంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జూలై 16 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: IND vs ENG: ఆఖరి ఓవర్‌లో గొడవ.. ఇంగ్లండ్ ఓపెనర్‌కు ఇచ్చిపడేసిన గిల్! వీడియో